BSNL Diwali Offer: 365 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ సంచలన ఆఫర్, 600 జీబీ డేటా, అపరిమిత కాల్‌లు, ఇంకా ఎన్నో బెనిఫిట్స్
ప్రభుత్వరంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (BSNL) తాజాగా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దీపావళి పండుగ సీజన్‌లో అన్ని ప్రధాన టెలికం ఆపరేటర్లు ప్రకటించిన ఆఫర్లు ముగిసిపోయినప్పటికీ.. నవంబర్ 7 వరకు అందుబాటులో ఉండేలా దీపావళి ప్రత్యేక ఆఫర్‌ను బీఎస్ఎన్‌ఎల్ పరిచయం చేసింది.
ప్రభుత్వరంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ (BSNL) తాజాగా సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దీపావళి పండుగ సీజన్‌లో అన్ని ప్రధాన టెలికం ఆపరేటర్లు ప్రకటించిన ఆఫర్లు ముగిసిపోయినప్పటికీ.. నవంబర్ 7 వరకు అందుబాటులో ఉండేలా దీపావళి ప్రత్యేక ఆఫర్‌ను బీఎస్ఎన్‌ఎల్ పరిచయం చేసింది. ఈ ఆఫర్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీతో రూ.1,999 రీఛార్జ్ ప్లాన్‌పై రూ.100 తగ్గింపును అందిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. యూజర్లు రూ.1,899కే ఈ ఆఫర్‌ను పొందవచ్చని తెలిపింది.
ఆగని లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న KPMG, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
అక్టోబర్ 28 నుంచి నవంబర్ 7 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 600జీబీ డేటా లభిస్తాయని తెలిపింది. ఇక రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా అందిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ ప్రకటించింది.దీపావళి తర్వాత ప్రత్యేక ఆఫర్!. రూ.1999 రీఛార్జ్ వోచర్‌పై రూ.100 తగ్గింపు పొందండి. ఇప్పుడు కేవలం రూ.1899 రీఛార్జ్ చేసుకోండి! ఒక సంవత్సరం పాటు 600 జీబీ డేటా, అపరిమిత కాల్‌లు, గేమ్స్, మ్యూజిక్, మరిన్ని బెనిఫిట్స్ ఆస్వాదించండి. ఈ పండుగ ఆఫర్ నవంబర్ 7, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఈరోజే రీఛార్జ్ చేసుకోండి. మీ డిజిటల్ జీవితాన్ని బీఎస్ఎన్ఎల్ మరింత ప్రకాశవంతం చేయనివ్వండి!’’ అని ఎక్స్ ప్రకటనలో బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.