Raipur Shocker: కన్నతండ్రే కామాంధుడై..రాయ్‌పూర్‌లో కూతురిపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గపు తండ్రి, తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి, నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు

త్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో (Raipur) ఓ తండ్రి తన 18 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులు (Father held for raping and torturing his daughter) పాల్పడిన ఘటనలో ఆదివారం పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Raipur Shocker: కన్నతండ్రే కామాంధుడై..రాయ్‌పూర్‌లో కూతురిపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గపు తండ్రి, తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి, నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు
Representational Image (Photo Credits: File Image)

Raipur, May 31: దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కనీసం ఇంట్లో కూడా రక్షణ ఉండటం లేదని కొన్ని దారుణ ఘటనలను చూస్తే తెలుస్తుంది. కన్నతండ్రే కూతురు పాలిట కామాంధుడుగా మారి పశువులా మీద పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నా అలాగే కోర్టులు ఈ పశువులకు ఉరిశిక్ష విధించినా కాని కామాంధుల్లో మార్పు రావడం లేదు.

తాజాగా చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో (Raipur) ఓ తండ్రి తన 18 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపులు (Father held for raping and torturing his daughter) పాల్పడిన ఘటనలో ఆదివారం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఉర్లా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) అమిత్ తివారీ (Urla Station House Officer (SHO) Amit Tiwari) వివరాల ప్రకారం..గత రెండేళ్లుగా తన తండ్రి తనపై అత్యాచారం చేసి హింసింస్తున్నాడని కూతురు ఆరోపించింది. నిందితుడు అయిన కన్న తండ్రీ ఆదివారం మళ్లీ బాధితురాలిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించడంతో తట్టుకోలేక ఆమె తన తల్లితో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.

వావి వరసలు మరచిన పెదనాన్న, మరదలి కూతురు నోట్లో టవల్ కుక్కి అత్యాచారం, ఇంటికి వచ్చినప్పుడల్లా పలుమార్లు లైంగిక దాడి, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

దీంతో అతడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 294(అశ్లీల చర్యలు), 323(బాధ కలిగించినందుకు శిక్ష), 376(అత్యాచారానికి శిక్ష), పోక్సో(లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ) చట్టం కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on May 31, 2021 04:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).