Hyderabad, May 31: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. వరుసకు పెద్దనాన్ అయిన ఓ కామాంధుడు తన కూతురు వయస్సున్న ఆ బాలిక(13)పై పలుమార్లు లైంగిక దాడి (girl was allegedly raped by her uncle) చేశాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట (jagathgirigutta) పోలీస్ స్టేషన్ పరిధిలో కూన మహాలక్ష్మినగర్‌లో చోటు చేసుకుంది.
జగద్గిరిగుట్ట పోలీసులు, బాధితుల తెలిపిన కథనం ప్రకారం... గతేడాది అక్టోబర్ 20న ఆ బాలిక టీవీ చూసేందుకు అదే వీధిలో ఉంటున్న పెదనాన్న ఇంటికి వెళ్లింది, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో వావి వరసలు మరిచిన పెదనాన్న కూతురు వయసు ఉన్న బాలికపై కన్నేశాడు. తన మరదలి కూతురు అని కూడా చూడకుండా నోట్లో టవల్ కుక్కి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత కూడా ఇంటికి వచ్చినప్పుడు పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబితే వారిని చంపేస్తానని బెదిరించాడు.
రోజులు గడుస్తున్న కొద్ది ఆ బాలికలో మార్పు కనిపించింది. ఈ నెల 24న తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లిన తల్లిదండ్రులకు బాలిక ఆరు నెలల గర్భవతి అని డాక్టర్ చెప్పిన విషయం తీవ్ర దిగ్భాంతికి గురిచేసింది. బాలిక తల్లిదండ్రులు అమ్మాయిని నిలదీస్తే ఏడుస్తూ జరిగినదంతా చెప్పుకొచ్చింది. అయితే లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ప్రశ్నించగా ముందు తనకేమీ తెలియదని బుకాయించాడు. దీంతో తమకు న్యాయం చేయాలని ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.