Delhi: వీడియో ఇదిగో, ఆకాశంలో ఉండగా ఒక్కసారిగా ఆగిపోయిన ఊయల చక్రం, మమ్మల్ని కాపాడండి అంటూ 50 మంది అరుపులు కేకలు
ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన నవరాత్రి మేళాలో సాంకేతిక లోపంతో ఫెర్రిస్ వీల్ (జెయింట్ వీల్) రైడ్‌లో చిక్కుకుని సుమారు 50 మంది విలవిలాడారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక సిబ్బంది మరియు ఇతరుల సహాయంతో ప్రజలను రక్షించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, రాత్రి 10:30 గంటల ప్రాంతంలో చక్రం తిరగడం ఆగిపోయింది.
- Read in
- తెలుగు
ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన నవరాత్రి మేళాలో సాంకేతిక లోపంతో ఫెర్రిస్ వీల్ (జెయింట్ వీల్) రైడ్‌లో చిక్కుకుని సుమారు 50 మంది విలవిలాడారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. సాంకేతిక సిబ్బంది మరియు ఇతరుల సహాయంతో ప్రజలను రక్షించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, రాత్రి 10:30 గంటల ప్రాంతంలో చక్రం తిరగడం ఆగిపోయింది. పై బోనులో ఉన్న వ్యక్తులు సుమారు అరగంట పాటు అక్కడ చిక్కుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఈ ఊయల చక్రం పనిచేయడం ఆగిపోయిందని పోలీసులు తెలిపారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారని వారు తెలిపారు. నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
Here's Video
#WATCH | A giant wheel at a Navratri Mela in Delhi's Narela area stopped working with people onboard. Everyone has been rescued safely. Legal action initiated by Police. Further details awaited: Delhi Police
(Viral video, confirmed by Police) pic.twitter.com/X91BM3x5Uw
— ANI (@ANI) October 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Oct 19, 2023 01:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

