Delhi Crime Horror:ఢిల్లీలో దారుణం, మహిళను ముక్కలు ముక్కలుగా నరికిన ఓ వ్యక్తి, ఆ భాగాలను వివిధ ప్రదేశాలలో పడేసిన నిందితుడు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్లైఓవర్ సమీపంలో పడేశాడు.

Delhi Crime Horror:ఢిల్లీలో దారుణం, మహిళను ముక్కలు ముక్కలుగా నరికిన ఓ వ్యక్తి, ఆ భాగాలను వివిధ ప్రదేశాలలో పడేసిన నిందితుడు
Representational Image | (Photo Credits: IANS)

New Delhi, July 13: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్లైఓవర్ సమీపంలో పడేశాడు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహిళ మృతదేహం శరీర భాగాలు వివిధ ప్రదేశాలలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బొట్టు ఎందుకు పెట్టుకున్నావంటూ విద్యార్థినిని కొట్టిన టీచర్, మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఫ్లైఓవర్ సమీపంలో వివిధ ప్రదేశాలలో ముక్కలు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. తూర్పు ఢిల్లీలో మహిళలు అదృశ్యమైన వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మహిళ మృతదేహం ఎవరిదో తెలిస్తే విచారణం చేయడం సులభం అవతుందని పోలీసులు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Jul 12, 2023 12:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).