Delhi Shocker:ఢిల్లీలో దారుణం, భార్యను చంపి శవం పక్కన పడుకున్న భర్త, రాత్రి ఇద్దరూ తప్పతాగిన తర్వాత భోజనం వడ్డింపు సమయంలో గొడవ

ఢిల్లీలో దారుణం చోటు (Delhi Shocker) చేసుకుంది. భార్యభార్తలు ఇద్దరూ బాగా మద్యం తాగిన తరువాత అన్నం దగ్గర చిన్న గొడవతో కొట్లాడుకున్నారు. ఈ గొడవలో భార్యను భర్త చంపేశాడు.

Representational Image | (Photo Credits: IANS)

New Delhi, Jun 20: ఢిల్లీలో దారుణం చోటు (Delhi Shocker) చేసుకుంది. భార్యభార్తలు ఇద్దరూ బాగా మద్యం తాగిన తరువాత అన్నం దగ్గర చిన్న గొడవతో కొట్లాడుకున్నారు. ఈ గొడవలో భార్యను భర్త చంపేశాడు.ఢిల్లీ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఢిల్లీలోని సుల్తాన్‌పూర్‌లో నివశిస్తున్న భార్యభర్తలిద్దరూ కలిసి ఫుల్‌గా మద్యం తాగారు. ఆ తర్వాత భర్త భోజనం చేద్దాం రా.. అంటే ఆమె తినేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం ( Not Serving Food After Drink) జరగడంతో భార్య చెంపదెబ్బ కొట్టింది. పైగా తనకు భోజనం పెట్టమని భర్త కోరిన ఆమె వడ్డించకపోవడంతో ఆగ్రహంతో సదరు వ్యక్తి ఆమెను కొట్టి, హత్య (Man Kills Wife) చేశాడు.

ఆ తర్వాత అతను మద్యం మత్తులో ఆమె చనిపోయిందన్న విషయం మరిచిపోయి ఆ శవం పక్కనే పడుకున్నాడు. కాసేపటి తర్వాత మేలుకున్నాక తన భార్య చనిపోయిందని గ్రహించాడు. అంతే ఆ వ్యక్తి రూ.40 వేలకు పైగా నగదు తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఐతే పోలీసులు నిందుతుడు వినోద్‌ కుమార్‌ దూబేగా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. జూన్ 17న ఉదయం 9.30 గంటలకు వినోద్ కుమార్ దూబే తన భార్య సోనాలి దూబేని హత్య చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భార్యను దిండుతో కొట్టి ఉక్కిరిబిక్కిరి చేసి హత్య చేసినట్లు గుర్తించారు.

గెస్ట్ హౌస్‌లో పార్టీ అన్నారు..ఫ్రెండ్స్ కదా అని వెళితే మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్ చేశారు, కోలకతాలో టెకిపై సామూహిక అత్యాచారం

పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని 259, 202, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( సౌత్) పవన్ కుమార్ తెలిపారు. అతని వద్ద నుండి మొత్తం 43,280, అతని వస్తువులతో కూడిన బ్యాగ్, రెండు మద్యం సీసాలు మరియు రక్తంతో తడిసిన దిండు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement