Delta Variant Surge: థర్డ్ వేవ్ ముప్పును తీసుకువస్తున్న డెల్టా–AY.4 కరోనా వేరియంట్, మహారాష్ట్ర, కేరళలలో వేగంగా వ్యాప్తిస్తున్న డెల్టా–4 మ్యూటేషన్‌

దేశంలో కరోనా ఛాయలు ఇప్పట్లో పోయేతా కనిపించడం లేదు. పరిశోధకులు డెల్టా వేరియంట్‌లో (Delta Variant Surge) ఇప్పటివరకు 25 మ్యాటేషన్లను నిపుణులు గుర్తించారు. భారత్‌లోనే కాకుండా, అమెరికా, యూరప్‌తో సహా అనేక దేశాలలో ఈ డెల్టా మ్యూటేషన్‌ పరివర్తన కొనసాగుతోంది.

Delta Variant Surge: థర్డ్ వేవ్ ముప్పును తీసుకువస్తున్న డెల్టా–AY.4 కరోనా వేరియంట్, మహారాష్ట్ర, కేరళలలో వేగంగా వ్యాప్తిస్తున్న డెల్టా–4 మ్యూటేషన్‌
COVID 2019 Outbreak| PTI Photo

New Delhi, Sep 21: దేశంలో కరోనా ఛాయలు ఇప్పట్లో పోయేతా కనిపించడం లేదు. పరిశోధకులు డెల్టా వేరియంట్‌లో (Delta Variant Surge) ఇప్పటివరకు 25 మ్యాటేషన్లను నిపుణులు గుర్తించారు. భారత్‌లోనే కాకుండా, అమెరికా, యూరప్‌తో సహా అనేక దేశాలలో ఈ డెల్టా మ్యూటేషన్‌ పరివర్తన కొనసాగుతోంది. దీని కారణంగా వైరస్‌లో మరిన్ని మార్పులు సంభవిస్తాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇక భారతదేశంలో డెల్టా–AY.4 అనే కరోనా వేరియంట్‌తో థర్డ్‌ వేవ్‌ ప్రమాదం ఇంకా తొలగిపోలేదని బయో టెక్నాలజీ విభాగం శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

దేశంలో డెల్టా–ఏవై. 4 వేరియంట్‌ వ్యాప్తి పెరుగుతోందని శాస్త్రవేత్తల బృందం హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సెకండ్‌ వేవ్‌ నుంచి డెల్టా వేరియంట్‌లో మ్యూటేషన్లు జరుగుతూనే ఉన్నాయని, ఈ నెల 13వ తేదీన బయోటెక్నాలజీ విభాగం బృందం కేంద్ర ప్రభుత్వానికి అందించిన ఒక నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వేరియంట్లలో మ్యూటేషన్లను గుర్తించేందుకు ఇప్పటివరకు 90,115 నమూనాల జన్యు శ్రేణి పూర్తయిందని తెలిపారు.

రూటు మార్చిన కరోనా, గాలి ద్వారా వాయువేగంతో దాడికి రెడీ, దేశంలో కొత్తగా 26,115 కరోనా కేసులు, ప్రస్తుతం భారత్‌లో 3,09,575 యాక్టీవ్ కేసులు

అందులో 62.9 శాతం నమూనాల్లో వైరస్‌కు సంబంధించిన తీవ్రమైన వేరియంట్స్‌ని గుర్తించామని నివేదికలో పేర్కొన్నారు. వీటిలో డెల్టా, ఆల్ఫా, గామా, బీటా, కప్ప వంటి వేరియంట్‌లు కోవిడ్‌–19కు సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా, వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా సోకుతాయని గుర్తించారు.

వ్యాక్సినేషన్‌లో చైనా రికార్డు బ్రేక్ చేసిన భారత్, దేశంలో తాజాగా 35,662 మందికి కోవిడ్, ప్రస్తుతం 3,40,639 కేసులు యాక్టివ్

అయితే దేశంలో మ్యూటేషన్‌ సి.1.2 అనే వేరియంట్‌ కేసు ఇప్పటివరకు గుర్తించలేదని నివేదిక స్పష్టంగా పేర్కొంది. అయితే కరోనా వైరస్‌కు సంబంధించిన డెల్టా, డెల్టాకు సంబంధం ఉన్న ఇతర మ్యూటేషన్లు నిరంతరం జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం పరీక్షిస్తున్న అనేక నమూనాల్లో డెల్టా–4 మ్యూటేషన్‌ను గుర్తిస్తున్నారు. డెల్టా–1 నుంచి డెల్టా–25 వరకు గుర్తించిన అన్ని మ్యూటేషన్లలో డెల్టా–4 అనే మ్యూటేషన్‌ చాలా వేగంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

చైనాలో మళ్లీ పుంజుకున్న కరోనా, విశ్వరూపం చూపిస్తున్న డెల్టా వేరియంట్, ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమల్లోకి

ప్రస్తుతం అదే డెల్టా–4 మ్యూటేషన్‌ మహారాష్ట్ర, కేరళలలో వ్యాపిస్తోంది. రాబోయే రోజుల్లో కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తే అందులో డెల్టాలో జరుగుతున్న ఈ మ్యూటేషన్లు కీలకంగా మారుతాయనే ఆందోళనన నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ) ప్రకారం, గత నెలలో మహారాష్ట్రలో 44 శాతం మంది, కేరళలో సుమారు 30 శాతం మంది రోగులలో డెల్టా–4 వేరియంట్‌ కనుగొన్నారు. ప్రస్తుతం డెల్టా –4 వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళనకరమైనదిగా వర్గీకరించింది. అయితే వైరస్‌కు సంబంధించిన ఈ కొత్త మ్యూటేషన్లు కొత్త అంటు వ్యాధులకు కారణం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 21, 2021 05:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).