Delta Outbreak in China: చైనాలో మళ్లీ పుంజుకున్న కరోనా, విశ్వరూపం చూపిస్తున్న డెల్టా వేరియంట్, ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమల్లోకి
Coronavirus Outbreak in China (Photo Credits: IANS)

Fujian, Sep 15: చైనాను మళ్లీ కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది.డ్రాగన్ కంట్రీలో ప్రమాదకర డెల్టా వేరియంట్‌ కేసులు (Delta Outbreak in China) రోజురోజుకీ పెరుగుతుండటంతో అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఫుజియాన్‌ ప్రావిన్స్‌లో (southeastern province of Fujian) ఒక్కరోజులోనే డెల్టా కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవడంతో డ్రాగన్‌ అప్రమత్తమైంది. ఆ ప్రావిన్స్‌లో కట్టుదిట్టమైన ఆంక్షలతో పాటు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

ఫుజియాన్‌లో ఆదివారం 22 కేసులు రాగా.. సోమవారం మరో 59 కొత్త కేసులు వచ్చినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది. 24గంటల వ్యవధిలోనే కేసులు రెట్టింపు సంఖ్యలో రావడంతో ఈ కేసుల సంఖ్య 102కి చేరిందని తెలిపారు. ఇక, పోర్టు సిటీ జియామిన్‌ నగరంలో గడిచిన రెండు రోజుల వ్యవధిలో 33 కేసులు వెలుగుచూడగా.. పుటియాన్‌లో మరో 59 కేసులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు వైరస్‌ వ్యాప్తికి అధిక అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించారు.

వచ్చే ఏడాది మొత్తం మాస్కులు ధరించాల్సిందే, స్పష్టం చేసిన నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌, దేశంలో తాజాగా 27,176 కరోనా కేసులు, గుజరాత్‌లో 8 నగరాల్లో ఈ నెల 25 వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ

ఆయా ప్రాంతాల్లో పాఠశాలలు, సినిమా థియేటర్లు, బార్లను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హుజియాన్‌ ప్రావిన్స్‌లోని జియామిన్‌ నగరం టూరిజం కేంద్రంగా ఉండగా.. అక్కడ డెల్టా కేసులు బయట పడటంతో 60శాతం విమానాలు రద్దు చేసినట్టు ఆ విమానాశ్రయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా బాధితులను కలిసిన వారిని గుర్తించడంపై దృష్టిపెట్టారు.