Drug Bust in Gujarat: గుజరాత్‌లో 3,300 కేజీల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న నేవీ, 5గురు పాకిస్తాన్ జాతీయులు అరెస్ట్, దేశంలోనే అతిపెద్ద డ్రగ్ ఆపరేషన్ ఇదే అని తెలిపిన ఎన్‌సిబి
భారత నావికాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఒక ముఖ్యమైన ఉమ్మడి భారీ ఆపరేషన్‌లో గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో ఓడ నుండి సుమారు 3,300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. నావికాదళం ప్రకారం, ఈ ఆపరేషన్ దేశంలోనే అతిపెద్ద డ్రగ్ సీజ్‌గా గుర్తించబడింది. ఒక చిన్న నౌకను నౌకాదళం అడ్డగించడంతో మంగళవారం ఈ ఆపరేషన్ జరిగింది.
- Read in
- తెలుగు
భారత నావికాదళం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఒక ముఖ్యమైన ఉమ్మడి భారీ ఆపరేషన్‌లో గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో ఓడ నుండి సుమారు 3,300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. నావికాదళం ప్రకారం, ఈ ఆపరేషన్ దేశంలోనే అతిపెద్ద డ్రగ్ సీజ్‌గా గుర్తించబడింది. ఒక చిన్న నౌకను నౌకాదళం అడ్డగించడంతో మంగళవారం ఈ ఆపరేషన్ జరిగింది. వాటిలో 3,089 కిలోల చరస్, 158 కిలోల మెథాంఫెటమైన్, 25 కిలోల మార్ఫిన్ ఉన్నాయి. ఆ షిప్‌లో ఉన్న అయిదుగురు పాకిస్థానీలను అదుపులోకి తీసుకున్నారు. పీ8ఐ ఎల్ఆర్ఎంఆర్ నిఘా ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా పోరుబందర్ తీరం వద్ద తిరుగుతున్న అనుమానిత షిప్‌ను గుర్తించారు.
ఆ షిప్‌లో డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు నేవీ అధికారులు భావించారు.తదుపరి విచారణ జరగుతోందని అధికారులు తెలిపారు. దీనిపై హోమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్‌సీబీ, నేవీ, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 3132 కిలోల భారీ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. మన దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చడానికి మన ప్రభుత్వం యొక్క తిరుగులేని నిబద్ధతకు ఈ చారిత్రక విజయం నిదర్శనం. ఈ సందర్భంగా ఎన్‌సీబీ, నావికాదళం, గుజరాత్ పోలీసులను అభినందిస్తున్నానని తెలిపారు. కొన్ని రోజుల క్రితం పుణెలో సుమారు 2500 కోట్లు ఖరీదు చేసే 1100 కేజీల మెఫిడ్రోన్ అనే డ్రగ్‌ను పట్టుకున్న విషయం తెలిసిందే.
Here's Home Minister Tweet
Pursuing PM @narendramodi Ji's vision of a drug-free Bharat our agencies today achieved the grand success of making the biggest offshore seizure of drugs in the nation. In a joint operation carried out by the NCB, the Navy, and the Gujarat Police, a gigantic consignment of 3132…
— Amit Shah (@AmitShah) February 28, 2024
Here's Spokesperson Navy Tweet
#IndianNavy in a coordinated ops with Narcotics Control Bureau, apprehended a suspicious dhow carrying almost 3300Kgs contraband (3089 Kgs Charas, 158 Kgs Methamphetamine 25 Kgs Morphine).
The largest seizure of narcotics, in quantity in recent times.@narcoticsbureau pic.twitter.com/RPvzI1fdLW
— SpokespersonNavy (@indiannavy) February 28, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 28, 2024 10:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

