Pet Owners Case: పెంపుడు జంతువుల ఓనర్లపై జరిమానాలు చట్ట విరుద్ధం.. చెన్నై కోర్టు కీలక తీర్పు
అపార్ట్ మెంట్ల ప్రాంగణాల్లో పెంపుడు జంతువులు చేసే చర్యల కారణంగా ఆ జంతువుల యజమానులపై జరిమానాలు, ఆంక్షలు విధిస్తూ అపార్ట్ మెంట్ యజమానుల సంఘం చేసే చర్యలు చట్ట విరుద్ధమని ఓ చెన్నై కోర్టు తీర్పుచెప్పింది.
Chennai, Jan 7: అపార్ట్ మెంట్ల (Apartments) ప్రాంగణాల్లో పెంపుడు జంతువులు చేసే చర్యల కారణంగా ఆ జంతువుల (Pet Animals) యజమానులపై జరిమానాలు, ఆంక్షలు విధిస్తూ అపార్ట్ మెంట్ యజమానుల సంఘం చేసే చర్యలు చట్ట విరుద్ధమని ఓ చెన్నై కోర్టు తీర్పుచెప్పింది. తిరువన్మయూర్ అపార్ట్ మెంట్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన అలాంటి తీర్మానాన్ని చట్ట విరుద్ధంగా పేర్కొంది. అలాంటి చర్యలు పెంపుడు జంతువుల యజమానుల హక్కులను ఉల్లంఘిస్తాయని, ఇది ఎంతమంత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పింది.
అసలేం జరిగింది?
అత్రియం ఓనర్స్ అసోసియేషన్ పెంపుడు జంతువులను లిఫ్ట్ లలో తీసుకెళ్లడంపై నిషేధం విధించిందని.. పెంపుడు జంతువులు మల విసర్జన చేస్తే జరిమానాలు విధిస్తున్నదని మనోరమ (78) అనే వృద్ధురాలు నిరుడు జూలైలో సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ పిటిషన్ కొట్టేయడాన్ని పై కోర్టులో ఆమె సవాల్ చేశారు. అక్కడ విచారణ సందర్భంగా జడ్జి పై వ్యాఖ్యలు చేశారు.
(The above story first appeared on LatestLY on Jan 07, 2025 10:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

