Haryana Rohtak Firing: రెజ్లింగ్ శిక్షణ కేంద్రంలో కాల్పుల కలకలం, ఐదుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు, పరిస్థితి విషమంగా ఉందని తెలిపిన పోలీసులు, రెజ్లింగ్ కోచ్‌ల మధ్య ఉన్న విభేదాలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు
హరియాణాలోని రోహ్‌తక్‌లోని ఓ రెజ్లింగ్ శిక్షణ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కాల్పులు జరిగి ఐదుగురు మృతి (Haryana Rohtak Firing) చెందారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.
Rohtak, February 13: హరియాణాలోని రోహ్‌తక్‌లోని ఓ రెజ్లింగ్ శిక్షణ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కాల్పులు జరిగి ఐదుగురు మృతి (Haryana Rohtak Firing) చెందారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. మృతి చెందిన వారిలో రెజ్లింగ్ కోచ్ కూడా ఉన్నారని పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. కొందరు రెజ్లింగ్ కోచ్‌ల మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
చనిపోయిన వారిలో ఇద్దరు మహిళా రెజ్లర్లు, ఇద్దరు కోచ్ లు ఉన్నారు. కోచ్ దంపతులు చనిపోగా.. వారి మూడేళ్ల కుమారుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన శుక్రవారం పొద్దుపోయిన తర్వాత మెహర్ సింగ్ అకాడమీలో (Mehar Singh Akhada) జరిగినట్టు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిని మండోతి గ్రామానికి చెందిన కోచ్ మనోజ్ కుమార్, అతడి భార్య సాక్షి, మోఖ్రా గ్రామానికి చెందిన మరో కోచ్ ప్రదీప్ ఫౌజీ, పూజా, సతీశ్ గా గుర్తించారు.
మనోజ్, సాక్షిల కుమారుడు సర్తాజ్ కు గాయాలైనట్టు పోలీసులు చెప్పారు. వ్యక్తిగత కక్షలే కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మనోజ్ కుమార్ తో గొడవలున్న వ్యక్తులే ఘటనకు పాల్పడి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు రోహ్ టక్ ఎస్పీ రాహుల్ శర్మ తెలిపారు.
రెజ్లింగ్ కోచ్ ల మధ్య ఉన్న విభేదాలే ఘటనకు కారణమని మరో వాదన వినిపిస్తోంది. బరోడా గ్రామానికి చెందిన మరో కోచ్ సుఖ్వీందర్ తో మనోజ్ కు పాత గొడవలున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కక్షను మనసులో పెట్టుకున్న సుఖ్వీందర్.. మనోజ్ నడుపుతున్న అకాడమీకి వచ్చి మనోజ్, సాక్షి, అతడి కుమారుడు సర్తాజ్, మరికొందరిపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, తర్వాతే అన్ని వివరాలు తెలుస్తాయని రోహ్తక్ రేంజ్ ఐజీ సందీప్ కిర్వార్ (Rohtak Range IG Sandeep Khirwar) చెబుతున్నారు
(The above story first appeared on LatestLY on Feb 13, 2021 01:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

