Coronavirus Threat: కరోనా చికిత్సకు ఎయిడ్స్ మందులు, జైపూర్ ఆసుప్రతిలో ఇటలీ పేషంట్లకు ట్రీట్‌మెంట్, అనుమతించిన ఆరోగ్య శాఖ, కరోనా బాధితులు

కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దీనికి ఇప్పటిదాకా ఎటువంటి విరుగుడు కనిపెట్టలేదు. దీని నివారణకు మార్కెట్లో ఎటువంటి మందులు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో కరోనా చికిత్స కోసం హెచ్‌ఐవి పేషంట్లు వాడే మందులును (Anti-HIV Drugs) ఉపయోగిస్తున్నారు.

Coronavirus Threat: కరోనా చికిత్సకు ఎయిడ్స్ మందులు, జైపూర్ ఆసుప్రతిలో ఇటలీ పేషంట్లకు ట్రీట్‌మెంట్, అనుమతించిన ఆరోగ్య శాఖ, కరోనా బాధితులు
Coronavirus Outbreak in India (Photo Credits: IANS)

Jaipur, Mar 10: కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. దీనికి ఇప్పటిదాకా ఎటువంటి విరుగుడు కనిపెట్టలేదు. దీని నివారణకు మార్కెట్లో ఎటువంటి మందులు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో కరోనా చికిత్స కోసం హెచ్‌ఐవి పేషంట్లు వాడే మందులును (Anti-HIV Drugs) ఉపయోగిస్తున్నారు.

ఖైదీలకు బెయిల్ ఇచ్చిన కరోనావైరస్

దేశంలో మెుదటిసారిగా జైపూర్‌లో కరోనా (coronavirus) సోకిన ఇటాలియన్ జంటకు (Italian couple) సోకిన కరోనా చికిత్సకు హెచ్ఐవి మందులు Lopinavir, Ritonavir మందులు వాడుతున్నారు. ఇందుకోసం వాళ్ల నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కరోనా వైరస్ సోకిన వ్యక్తులపై హెచ్ఐవి మందులను వాడటానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) నుంచి అనుమతి తీసుకున్నామని తెలిపారు.

ఈ అనుమతి తర్వాతే Lopinavir, Ritonavir కాంబినేషన్‌ ధెరపీకి ఆమోదం లభించింది. ఈ మందులను జైపూర్ ఆసుప్రతిలో చేరిన ఇటాలియన్ జంటకు వాడుతున్నారు. అయితే వ్యాధినిరోధక శక్తి తక్కువున్నవాళ్లమీద ఈ వ్యాధి ప్రభావం ఎక్కువ. ఎయిడ్స్ వ్యాధి కూడా ఇంతే. వ్యాధినిరోధక శక్తిని బలహీనం చేస్తుంది.

ఇండియాలో  రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

అందుకే HIV మందుని చైనాలో కూడా ఉపయోగించారు. ఇది ఎలా పనిచేస్తుందో ఇంకా చెప్పలేము అన్నారు. అయితే దీని వాడకానికి పేషెంట్ల నుంచి అనుమతిని తప్పకుండా తీసుకోవాలని సీనియర్ అధికారులు తెలిపారు.

తిరుమల వెళ్లేవారికి హెచ్చరిక, జలుబు, దగ్గు ఉన్నవారు శ్రీవారి దర్శనానికి రావొద్దని కోరిన టీటీడీ అధికారులు

కరోనా వైరస్ సోకిన 69 ఏళ్ల ఇటాలియన్ వ్యక్తి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాడు. అతనికి జ్వరం లేదు, ఆరోగ్యం నిలకడగా ఉంది. కాగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేస్తామని ఆశిస్తున్నాం. కరోనా సోకిన అతని భార్య కూడా మా వైద్యానికి ఒప్పుకున్నారని Medical and Health and Family Welfare అదనపు ఛీప్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ అన్నారు.

ఇదిలా ఉంటే భారత దేశంలో 70 శాతం మంది మాత్రం హెచ్ఐవి పాజిటివ్ రోగులు ఈ మందులున్ని వాడుతున్నారు. దేశంలోని ప్రజారోగ్య పరిస్ధితిని దృష్టిలో పెట్టుకుని అత్యవసర సమయంలో మాత్రమే ఈ మందుని వాడే విధంగా రూల్స్ చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Mar 10, 2020 04:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).