Chennai, March 8: కరోనావైరస్(COVID 19) కేసుల సంఖ్య భారత్‌లో రోజు రోజుకీ పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కరోనా అనుమానితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నా, వాటిలో పాజిటివ్ కేసులు వేళ్లమీద లెక్కబెట్టే విధంగానే ఉన్నాయి. ఇప్పటికే దీని భారీన దేశ వ్యాప్తంగా (Coronavirus in India) 34 మంది పడగా తాజాగా మరో ఆరు మందికి కరోనా పాజిటివ్ (Coronavirus) వచ్చింది. దీంతో ఈ కేసుల సంఖ్య ఇండియాలో 40కి చేరింది.
కాటేస్తున్న కరోనా, ఆరు రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ మెసేజ్
కేరళలో (kerala) ఐదుగురికి ఈ ప్రాణాంతక వైరస్ సోకింది. ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ కుటుంబంలోని ముగ్గురు సభ్యులు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ ముగ్గురితో పాటు మరో ఇద్దరి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ (Coronavirus in Kerala) వచ్చింది. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా ప్రకటించారు. ఆ కుటుంబంలో కరోనా బారిన పడిన వారిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు.
Here's ANI Tweet
Total positive cases of #Coronavirus in the country rises to 39 https://t.co/7rGWznHaM8
— ANI (@ANI) March 8, 2020
కేరళ ఆరోగ్యశాఖమంత్రి కేకే శైలజా మాట్లాడుతూ ఆ కుటుంబ సభ్యులు ఎయిర్‌పోర్టులో తమ ప్రయాణ వివరాలు తెలియజేయలేదన్నారు. ఈ కారణంగానే వారికి తక్షణం పరీక్షలు చేయలేదన్నారు. వారు ఇటలీ నుంచి వచ్చాక వారి బంధువులను కలుసుకున్నారని, వారికి కూడా వ్యాధి లక్షణాలు కనిపించిన నేపధ్యంలో వారు ఆసుపత్రికి వచ్చారన్నారు. వారినందిరినీ ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.
Here's ANI Tweet
Tamil Nadu Health Secretary Beela Rajesh: We are fully prepared. We have procedures to contain this disease. We have 1086 patients under home surveillance. #coronavirus https://t.co/yR7iARwd0O pic.twitter.com/zhcmM2H6gk
— ANI (@ANI) March 8, 2020
తాజాగా, తమిళనాడులో మొట్టమొదటి కరోనా కేసు (Coronavirus in Tamil Nadu) వెలుగు చూసింది. మస్కట్ నుంచి చెన్నై వచ్చిన 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆ వ్యక్తి మార్చి 5న నగరంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. కరోనా అనుమానితుడిగా భావించి అతడిని ఆసుపత్రి వర్గాలు ఐసోలేషన్ వార్డుకు తరలించాయి. ఆపై అతడి నుంచి శాంపిల్స్ సేకరించి కరోనా వైద్య పరీక్షల కోసం పుణే పంపారు. ఆ పరీక్షల నివేదిక ఇవాళ వచ్చింది. అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దాంతో ఐసోలేషన్ వార్డులోనే అతడికి చికిత్స కొనసాగిస్తున్నారు. ఆ వ్యక్తి కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచారు.
కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తాజాగా బయటపడ్డ ఆరు కొత్త కేసులతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40కి చేరింది. ఇక ఢిల్లీలో ఇప్పటివరకు 21 పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇటీవల వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఢిల్లీలో వర్షపాతం నమోదైంది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో కరోనా మరింత వ్యాప్తి చెందుతుందన్న వదంతులు పుట్టుకొచ్చాయి. అయితే వాతావరణ ఉష్ణోగ్రతల ప్రభావం కరోనా వ్యాప్తిపై ఉండదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ తెలిపారు. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.
మోదీనే నాకు దేవుడు, భావోద్వేగానికి గురయిన డెహ్రడూన్ మహిళ, కన్నీటి పర్యంతం అయిన ప్రధాని
అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపజేస్తున్న ఓ వ్యక్తిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. జిల్లా మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సోషల్ మీడియాలో అతను పెట్టిన పోస్టులో.. పాసిఘాట్‌లో ఇద్దరికి కరోనా సోకిందని.. వారిని అసోంలోని దిబ్రుఘర్‌కి తరలించారని పేర్కొన్నాడు. స్థానికుల్లో భయాందోళన నెలకొనేలా ఉన్న ఈ పోస్టును తీవ్రంగా పరిగణించిన మెడికల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది.
కరోనావైరస్ ప్రభావంతో హైదరాబాద్ - మహేంద్రాహిల్స్ కాలనీలో స్కూళ్లకు సెలవులు
కరోనా వైరస్ వ్యాప్తిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM ) అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటివరకు 25 ఆసుపత్రుల్లో 168 ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
15 మంది ఇటలీ పర్యాటకులకు కోవిడ్-19 వైరస్
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి తాము అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నామని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కాగా,కరోనా వైరస్ పుట్టుకొచ్చిన చైనాలోని హుబేయ్ ప్రావిన్స్‌లో ఇప్పటివరకు దాదాపు 1లక్ష మంది వైరస్ బారినపడ్డారు. ఇందులో 3500 మంది మృతి చెందారు.
హోళీ వేడుకలు లేవు, హోళీ మిలన్‌కు దూరంగా అగ్రనేతలు
కరోనాపై వదంతులను నమ్మొద్దని ప్రధాని మోదీ (PM Modi) ప్రజలకు పిలుపునిచ్చారు. వైద్యుల సలహాలను పాటించాలని స్పష్టం చేశారు. మన సంప్రదాయంలో భాగమైన ‘నమస్కారాన్ని’ మళ్లీ ప్రారంభించాలని చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని మోదీ అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒకవేళ వైరస్ వ్యాప్తి పెరిగితే చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. క్వారంటైన్ చేయడానికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాలని, అత్యవసర వైద్య సేవలందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉంటుందన్నారు.