New Delhi, March 4: చైనాలోని (China) వుహాన్‌లో పుట్టి దేశ దేశాలకు విస్తరించిన కోవిడ్-19 (Coronavirus) తాజాగా భారత దేశాన్ని వణికిస్తోంది. ఇప‍్పటికే ఢిల్లీ, తెలంగాణలో వైరస్‌లను గుర్తించగా ఇప్పుడు ఢిల్లీలో ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. ఇటలీ దేశం నుంచి భారతదేశ సందర్శనకు వచ్చిన 15 మంది పర్యాటకులకు కరోనా వైరస్ పాజిటివ్ (Coronavirus Outbreak) అని పరీక్షల్లో తేలడం సంచలనం రేపింది.
హైదరాబాద్‌లో మరో 36 మందికి కరోనావైరస్ లక్షణాలు?
15 మంది ఇటాలియన్ టూరిస్టులకు (15 Italian Tourists) కరోనా వైరస్ సోకిందని బుధవారం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వైద్యులు ప్రకటించారు.
జైపూర్ నగరంలో పర్యటిస్తున్న ఇటాలియన్ జంటకు కరోనా వైరస్ సోకిందని మంగళవారం నిర్ధారించారు. ఈ జంటతో కలిసి తిరిగిన మరో 15 మంది ఇటలీ పర్యాటకులకు బుధవారం వైద్యపరీక్షలు చేయగా వారికి కూడా కొవిడ్-19 సోకిందని వెల్లడవడంతో వైద్యాధికారులు షాక్‌కు గురయ్యారు. వైరస్ సోకిన 15 మంది ఇటాలియన్ టూరిస్టులను ఢిల్లీకి సమీపంలోని ఛావ్లాలోని ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వీరిలో ఒకరు భారతీయులు కాగా,14 మందిని ఇటలీకి చెందిన వారుగా పేర్కొన్నారు.
ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
భారత పర్యటన కోసం ఇటలీ నుంచి మొత్తం 23 మంది పర్యాటకులు గత నెలలో రాజస్థాన్‌కు వచ్చారు. అయితే మొదట ఒకరికి మాత్రమే కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత ఆయన భార్యతో పాటు మిగతా వారికి ఈ వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వైరస్ సోకిన వారి సంఖ్య (COVID-19 Spreads In India) ఇండియాలో 21కి చేరింది. 21 మందిలో 14 మంది ఇటలీ పర్యాటకులు, ఒక ఇండియన్(ఇటలీ పర్యాటకుల గ్రూపులో ఉన్న వ్యక్తి), ముగ్గురు కేరళ వాసులు, ఒకరు ఢిల్లీ, ఒకరు ఆగ్రా, మరొకరు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. కేరళలోని ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్ నుంచి ఉపశమనం పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఆస్పత్రి డైరక్టర్‌ను కరోనా చంపేసింది
మరోవైపు ఇటలీ నుండి తిరిగి వచ్చి ఢిల్లీ నివాసి ఏర్పాటు చేసిన పార్టీకి కొంతమంది విద్యార్థులు హాజరైనందున రెండు నోయిడా పాఠశాలల్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో ఎవరికీ వైరస్ సోకలేదని తేలింది. కాగా చైనాలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 80,270 కు చేరుకుంది. మార్చి 3 నాటికి మొత్తం చైనాలో మరణాల సంఖ్య 2,981కి చేరింది. ఇటలీలో ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య 79కి చేరింది.
వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు
హోలీ వేడుకలకు దూరం: కరోనా వైరస్ ఇప్పుడు దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్ అమెరికా సహా ఇతర దేశాలలో వేగంగా వ్యాపిస్తోంది. ఇది ఇలావుంటే కరోనా వైరస్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రకటించిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోలీ వేడుకలకు దూరంగా వుంటున్నానని ప్రకటించారు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక సందేశాన్ని ట్వీట్ చేశారు.
యూకెలో కరోనా వల్ల 4 లక్షల మంది చనిపోతారట
కొచ్చి తీరానికి కోస్తా విక్టోరియా నౌక: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇటలీ దేశానికి చెందిన లగ్జరీ విహారనౌక ‘కోస్తా విక్టోరియా’లోని 459 మంది ప్రయాణికులు జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుండటంతో వారికి వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. ఇటాలియన్ విహారనౌక ‘కోస్తా విక్టోరియా’ కేరళ రాష్ట్రంలోని కొచ్చి తీరానికి వచ్చింది.
విహారనౌకలో ఉన్న 459 మందిలో 305 మంది భారతీయులున్నారు. విహారనౌకలోని వారందరూ శ్వాసకోశ సమస్యలు, జ్వరంతో బాధపడుతున్నారని వారికి పరీక్షలు చేపిస్తున్నామని కొచ్చి ఓడరేవు ప్రజాసంబంధాలశాఖ అధికారి జిజో థామస్ చెప్పారు.
కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు బట్టబయలు
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా మూడువేల మందికి పైగా మరణించారు. జపాన్ విహార నౌకలో ప్రయాణికులు ఈ వైరస్ బారినుంచి కోలుకొని సురక్షితంగా బయటపడ్డారు. మళ్లీ ఇటలీ విహారనౌకలో ప్రయాణికులు కూడా అనారోగ్యం పాలవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.