Pékin, February 18: చైనాలో కరోనావైరస్ (COVID-19 Outbreak) విలయతాండవం చేస్తోంది. అక్కడ రోజు రొజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ వైరస్ అంటే సామాన్యుల నుంచి ట్రిట్మీంట్ చేసే డాక్టర్ల దాకా భయంతో హడలిపోతున్నారు. రోజురోజుకూ ఈ వైరస్ భారీన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో చైనా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటి వరకూ 1868 మంది ప్రాణాలు కోల్పోగా.. 72 వేల మంది కోవిడ్ భారీన పడ్డారని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
వ్యాక్సిన్ తయారీలో మరో ముందడుగు
కరోనా భారీన పడిన వారికి చికిత్స చేస్తున్న వైద్యులకు కూడా సోకడంతో వారు కూడా మృత్యువాత పడుతున్నారు. దీంతో చైనా వ్యాప్తంగా దీనిపై ఆంక్షలు విధించడం జరిగింది. అత్యవసరం అయితే తప్ప బయటికి రాలేని పరిస్థితి చైనాలో నెలకొంది. కోవిడ్ ధాటికి మెడికల్ సిబ్బందికి కూడా పెను ప్రమాదం ఉన్నట్లు రిపోర్ట్ అంచనా వేసింది.
తాజాగా.. వుహాన్‌లోని ఆస్పత్రి డైరెక్టర్ (Wuhan Hospital Director) కూడా ఈ వైరస్‌తో కన్నుమూశారు. వుచాంగ్ ఆస్పత్రి డైరెక్టర్ లియూ చిమింగ్ (Wuchang Hospital Director Liu Zhiming) ఈ వైరస్‌తో మృతి చెందినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. లియూ చిమింగ్‌ను కాపాడేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్లు వైద్యులు వెల్లడించారు. కరోనా వైరస్ గురించి ముందస్తు హెచ్చరిక జారీ చేసిన వైద్యుడు లియూ చిమింగ్ మృతి చెందడం పట్ల చైనాలో లక్షలాది మంది ఆయనకు సంతాపం ప్రకటించారు.
యూకెలో కరోనా వల్ల 4 లక్షల మంది చనిపోతారట
చిమింగ్ ఈ ఆస్పత్రికి తొలి డైరెక్టర్. ఇలా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు, డైరెక్టర్‌లే కరోనాతో చనిపోతున్నారంటే.. దాని తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు కరోనాను కనుగొన్న వైద్యుడు ఈ వైరస్ భారీన పడి చైనాలోని వూహాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.