Coronavirus ‘could claim 400,000 UK lives’ warns British expert (Photo-PTI)

London, Febuary 16: చైనాలోని వూహాన్‌లో ఉద్భవించి, ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కోవిడ్‌–19 (Covid - 19) మరణాల సంఖ్య ఇప్పటికే 1669కు చేరుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో కరోనా పేరు వినిపించిన విషయం విదితమే. దీని ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి సైతం వెనకాడింది. అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్

క్రమంగా కరోనా వైరస్‌ (Coronavirus) వల్ల ఒక్క చైనాలోనే (China) స్వల్పకాలంలో వందలాది మంది టపటపా రాలిపోవడంతో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తమైంది. ఇప్పటికిప్పుడు కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు టీకా మందును కనుక్కోవాలన్నా కనీసం ఆ ప్రయత్నం జరగడానికే 18 నెలల సమయం పడుతుందని వైద్య శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే ఈ కోవిడ్-19 వైరస్ మీద బ్రిటీష్ శాస్త్రవేత్త (British expert) సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలో ఈ వైరస్ వ్యాపిస్తే దాదాపు 4 లక్షల మంది చనిపోతారని శాస్త్రవేత్త, ప్రోఫెసర్ నీల్ ఫెర్గూసన్ (UK Scientist Professor Neil Ferguson) వెల్లడించారు. ఇతను లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ప్రోఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. ఈ వైరస్‌ను నియంత్రించకపోతే..ప్రపంచ వ్యాప్తంగా అధికంగా మరణాలు సంభవించే అవకాశాలున్నాయని తెలిపారు.

Here's Channel 4 News Tweet

అయితే ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుస్తోందని, పెద్దలు మాత్రమే దీని బారిన పడుతున్నారని, పిల్లల్లో చాలా తక్కువ శాతంగా ఉందన్నారు. జనాభాలో 60 శాతం మందికి వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. కాగా కోవిడ్ -19 వైరస్ యూకేలో కూడా పాకింది. పలువురు చికిత్స తీసుకుంటున్నారు. వైరస్‌ను నివారించే ప్రయత్నాలు చేపడుతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు.

కోవిడ్19 పాజిటివ్ కేసుల్లో కేరళ పురోగతి

ఓ విమానంలో ఓ ప్రయాణీకుడు అనారోగ్యానికి గురికావడంతో అతనికి వైద్య చికిత్స అందించారు. ఇతనికి ఈ వైరస్ లక్షణాలు ఉండే అవకాశాలున్నాయని వైద్యులు భావిస్తున్నారు. చైనా భూభాగంలో కోవిడ్ - 19 వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 11669కి దాటింది. నిన్న ఒక్క రోజే 143 మంది మృతి చెందారు. రోజుకు 2 వేల 641 మంది వైరస్ బారిన పడుతున్నారని, ప్రపంచ వ్యాప్తంగా 69 వేల మందికిపైగానే కేసులున్నట్లు అంచనా.

నౌకలో చిక్కుకొని ఆవేదన చెందుతున్న భారతీయులు

ఫ్రాన్స్‌లో కరోనా వైరస్ సోకి చైనా పర్యాటకుడు మృతి చెందారు. ఇది ఆసియా బయట కరోనా వైరస్ సోకి మృతిచెందిన తొలి వ్యక్తిగా ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా జపాన్, మలేసియాలో కూడా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

కోవిడ్‌–19కి ‘సార్స్‌’ వైరస్‌ లక్షణాలున్నాయని శాస్త్రవేత్తలు తొలుత అంచనా వేశారు. కానీ, కోవిడ్‌–19లో సార్స్‌ వైరస్‌ లక్షణాలు ఏమాత్రం లేవని, హెచ్‌1ఎన్‌1 వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. కోవిడ్‌–19 వైరస్‌ స్వైన్‌ప్లూకి దగ్గరగా ఉన్నట్టు సింగపూర్‌ మినిస్టర్‌ ఫర్‌ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ లారెన్స్‌ఓంగ్‌ తెలిపారు. ఇది సార్స్‌ కన్నా అత్యంత వేగంగా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని జాతీయ అంటువ్యాధుల కేంద్రం (ఎన్‌సీఐడీ) పరిశోధకులు వెల్లడించారు.

కరోనా వైరస్‌ పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌–19గా (కరోనా, వైరస్‌ డిసీజ్‌) మార్చింది, కరోనా అనే పేరు ఇప్పటికే వ్యక్తులకు, ప్రాంతాలకు, సంస్థలకు ఉండటం వల్ల అది ఒక వ్యాధిని సూచించే వైరస్‌గా మాత్రమే ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ కరోనా వైరస్‌ పేరును కోవిడ్‌గా మారుస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్‌ వైరస్‌ బారిన పడినవారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్లామా అనేది తెలుసుకోవడానికి క్లోజ్‌ కాంటాక్ట్‌ డిటెక్టర్‌ అనే యాప్‌ను చైనా రూపొందించింది.

ఈ వైరస్‌ 28 దేశాలకు విస్తరించి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోవిడ్‌ వైరస్‌ దేనిద్వారా విస్తరిస్తుందనే విషయంలో ఏకాభిప్రాయం లేదు. కొన్ని దశాబ్దాల క్రితమే కరోనా వైరస్‌ గుర్తించారు. కరోనా వైరస్‌ అనేది ఒక వైరస్‌ కాదు. వైరస్‌ కుటుంబం పేరు. గతంలో వచ్చిన ఐదారు రకాల వైరస్‌లు కూడా ఇదే కోవలోకి వస్తాయి.

అవన్నీ జంతువులు, పక్షులు ద్వారా వ్యాపించినవి. కోవిడ్‌–19 వైరస్‌ మనుషుల నుంచి శరవేగంగా మనుషులకు సంక్రమించే వైరస్‌. ఇదిలా ఉంటే ప్రపంచంలో ప్రబలుతున్న ప్రాణాంతక వ్యాధుల వల్ల మానవ సమాజం ఆర్థికంగా నష్టపోతోంది. గతంలో ‘సార్స్‌’ వల్ల ఉత్పత్తి క్షీణించి, 40 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా.