COVID-19: కరోనా పని పట్టాలంటే 18 నెలలు ఆగాల్సిందే, అందుబాటులోకి రానున్న మొదటి వ్యాక్సిన్, అప్పటిదాకా ఉన్న వనరులతోనే పోరాటం చేయాలన్న డబ్ల్యూహెచ్‌ఓ, ఇక నుంచి కరోనా పేరు కోవిడ్-9
Coronavirus disease named Covid-19 vaccine could be ready in 18 months, says WHO (Photo-Getty)

Geneva, February 12: చైనాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ను (Coronavirus) కట్టడి చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) రంగంలోకి దిగింది. దీని విరుగుడుకు వ్యాక్సిన్ తయారుచేసేందుకు నడుం బిగించింది. ఇప్పటికే ఈ వ్యాధి మూలంగా 1100 మందికి పైగా చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఘోస్ట్ నగరంగా మారిన చైనా

ప్రపంచాన్ని వణికిస్తోన్న ఈ కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త పేరు పెట్టింది. ఇకపై కరోనాను అధికారికంగా ‘కోవిడ్‌–19’గా పిలవనున్నారు. ఇందులో సీ అక్షరం కరోనాను, వీ అక్షరం వైరస్‌ను, డీ అక్షరం డిసీజ్‌ (జబ్బు)ను, 19ని.. వ్యాధిని కనుగొన్న 2019కి సూచనగా పెట్టారు.   అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్

ఇదిలా ఉంటే ఈ వైరస్‌ నిరోధక టీకాకు (Coronavirus vaccine) సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌-19 నిరోధకానికి సంబంధించిన మొదటి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్ చెప్పారు.

Here's World Health Organization Tweet

అయితే ఈలోపు అందుబాటులో ఉన్న వనరులతోనే ఈ వైరస్‌పై పోరాటం చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని అన్ని దేశాలకు సూచించారు. ఈ వైరస్ ఉగ్రవాద చర్య కంటే చాలా ప్రమాదకరమైందని దీనిని ప్రజా శత్రవుగా పరిగణించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Here's Tedros Adhanom Ghebreyesus Tweet

ఈ సందర్భంగా కోవిడ్‌-19 (Covid-19) నిరోధక టీకాలు, మందుల పరిశోధనల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి 400 మంది శాస్త్రవేత్తలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు బట్టబయలు

మరోవైపు ప్రాణాంతక కోవిడ్‌-19 చైనాను హడలెత్తిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం ఒకటి బీజింగ్‌ చేరుకుని వైరస్‌ నిరోధక చర్యల్లో సాయం అందించడం మొదలుపెట్టిందని చైనా ఆరోగ్య కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్

చైనా ఆరోగ్య శాఖ అధికారుల సమాచారం మేరకు కరోనా మహమ్మారికి 1,016 మంది మృత్యువాత పడ్డారు. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన వారి సంఖ్య 42, 638కి చేరింది. వైరస్‌ కారణంగా నిన్న ఒక్కరోజే 108 మంది మరణించారని, 2,478 కొత్త కేసులు నమోదయ్యాయని చైనా ఆరోగ్య కమిషన్‌ తెలిపింది.

వారంలో పెళ్లి, చైనాలో చిక్కుకుపోయిన కర్నూలు యువతి

ఇప్పటికే కరోనా వైరస్‌ చికిత్సకు ఒక టీకాతో జంతు పరీక్షలు మొదలుపెట్టినట్లు లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. కొన్ని నెలల్లో తొలిదశ ప్రయోగాలు పూర్తి చేసి, మానవుల్లో టీకా సామర్థ్యంపై పరీక్షలు చేపడతామన్నారు.