Wuhan coronavirus lockdown (photo-ANI)

Kurnool, Febuary 3: కరోనావైరస్ (Coronavirus) ఇప్పుడు ప్రపంచానికి ముచ్చెమటలు పుట్టిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీ (Wuhan city In China) కేంద్రంగా పుట్టిన ఈ వైరస్ మొత్తం ప్రపంచానికే సవాల్ విసురుతోంది. దీనికి విరుగుడు లేకపోవడంతో ఈ వైరస్ సోకిన వాళ్లు (Deadly coronavirus) తప్పక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు చైనాలో చిక్కుకున్న వారిని తమ దేశాలకు ఆఘమేఘాల మీద తరలిస్తున్నాయి. వారిని ప్రత్యేక ప్రదేశాలలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇండియా (India) కూడా రెండు ఎయిర్ జెట్ విమానాలను చైనాకు పంపి మనవాళ్లను ఇండియాకు తరలించింది. 304 మందిని బలి తీసుకున్న కరోనావైరస్

అయితే చైనాలో ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన అమ్మాయి (Andhra Girl Stuck In China) వుహాన్ నగరంలో చిక్కుకుపోయింది. ఇండియాకి రావాలని ఉందని సోషల్ మీడియా వేదిక ద్వారా ఓ వీడియోని విడుదల చేసింది. కర్నూలు జిల్లా (Kurnool) బండి ఆత్మకూరు మండలం ఈర్లపాడుకు చెందిన సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అన్నెం శృతి టీసీఎల్‌‌లో ఉద్యోగం చేస్తోంది. కాగా మూడు నెలల శిక్షణ కోసం సహచరులు 58 మందితో కలిసి చైనా వెళ్లింది. ప్రపంచానికి పెను ముప్పు

భారత్‌లో తొలి కరోనావైరస్ కేసు నమోదు

శిక్షణ కోసం వూహాన్‌కు వెళ్లిన 58 మందిలో ఇద్దరు అక్కడే నిలిచిపోయారు. ప్రస్తుతం ఆమె జ్వరంతో బాధపడుతుండటంతో (High Body Temperature) అక్కడి అధికారులు శృతిని ఇండియాకు పంపేందుకు ఒప్పుకోవడం లేదు. జ్యోతితో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో యువకుడికి జ్వరం కొంత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఈ కారణంగా వారిని ఇండియాకు పంపేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. భారత్‌లో కరోనావైరస్ రెండో కేసు నమోదు

కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు బట్టబయలు

తనకు కరోనా వైరస్‌ లక్షణాలు లేవని, అధికారులు తనను విమానం ఎక్కేందుకు అనుమతి ఇవ్వలేదంటూ ఓ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోను చూసిన కుటుంబ సభ్యులు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డిలను కలిసి తమ సమస్యను వివరించారు. వారు ఈ విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.

కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు బట్టబయలు

ఇదిలా ఉంటే ఇటీవలే ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఆమె వివాహం ఈ నెల 14న నంద్యాలలో జరగాల్సి ఉంది.