Air India Boeing 747 Brings Back 324 Indian Nationals From China (Photo Credits: ANI)

New Delhi, Febuary 01: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ (coronovirus) అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు చైనాలో (China) చిక్కుకున్న తమ దేశ పౌరులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో కరోనా వైరస్ అలజడి

ఇందులో భాగంగా చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది. ఎయిరిండియా (Air India) విమానం శుక్రవారం రాత్రి వుహాన్‌కు చేరుకున్నది. ఇందులో రామ్ మనోహర్ లోహియా దవాఖానకు చెందిన ఐదుగురు వైద్య నిపుణులు కూడా వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు

మొదటి విడతగా 324 మందిని ప్రత్యేక విమానంలో (Air India Boeing 747) ఢిల్లీకి తరలించింది. 2020, జనవరి 31వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చైనా వెళ్లిన ఎయిరిండియా బోయింగ్‌ ఫ్లైట్ 'అజంతా'... రాత్రి 10 గంటల తర్వాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైంది.

Here's the tweet:

ప్రపంచ దేశాలకు పరుగులు

2020, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. వుహాన్‌ నుంచి తీసుకొచ్చిన భారతీయులను వెంటనే వారివారి స్వస్థలాలకు పంపించకుండా.. ఢిల్లీ సమీపంలోని మనేసర్‌లో భారత సైన్యం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వైద్య శిబిరాలకు తరలించారు.

Take a Look at the Tweet by ANI:

డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్

వారంతా ఇక్కడ రెండు వారాలపాటు వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. వారందరికీ విమానాశ్రయంలోనే ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు కనిపించిన వారిని ఢిల్లీ కంటోన్మెంట్‌ బేస్‌ హాస్పిటల్‌లోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. చైనాలోని వుహాన్‌లో మిగిలిపోయిన మరికొంతమంది భారతీయులను తీసుకొచ్చేందుకు నేడు మరో విమానాన్ని చైనాకు పంపనున్నారు.

భారత్‌లో తొలి కరోనావైరస్ కేసు నమోదు

ఈ రెస్క్యూ మిషన్‌కు కెప్టెన్‌ అమితాబ్‌ సింగ్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఎయిరిండియా ఈ తరహా మిషన్లను గతంలో లిబియా, ఇరాక్‌, యెమన్‌, కువైట్‌, నేపాల్‌లో చేపట్టింది. 1990 ఆగస్టులో లక్ష మందికి పైగా భారతీయులను 488 విమానాల్లో 59రోజుల్లో తరలించిన చరిత్ర ఎయిరిండియాకు ఉంది.

తెలంగాణలో ఒక్క కరోనవైరస్ కేసు కూడా నమోదు కాలేదు, పుకార్లను నమ్మొద్దు

2015లో ఆపరేషన్‌ రాహత్‌ పేరుతో యెమన్‌ నుంచి భారతీయులను తీసుకొచ్చింది. చైనా నుంచి వస్తున్న వారితోపాటు.. ఇక్కడి నుంచి వెళ్లిన సిబ్బందికి ఆ మహమ్మారి కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. విమానంలో ఐదుగురు వైద్యులతోపాటు, మందులు, మాస్కులు, ఓవర్‌ కోట్లను అందుబాటులో ఉంచారు.