Coronavirus In Hyderabad: హైదరాబాద్‌లో కరోనా వైరస్ అలజడి, అనుమానిత లక్షణాలతో ఫీవర్ ఆస్పత్రిలో నలుగురు, వారిని నిశితంగా పరిశీలిస్తున్నామన్న హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ శంకర్
Coronavirus Spread (Photo Credit: IANS)

Hyderabad, January 27: చైనాను కుదిపేస్తున్న కరోనా వైరస్ (Coronavirus) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అక్కడి నుంచి ఇది ప్రపంచ దేశాలకు పరుగులు పెడుతోంది. ఈ వైరస్ లక్షణాలు ఇప్పుడు హైదరాబాద్ ని (Hyderabad) కూడా తాకినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వైరస్ లక్షణాలు బయటపడకపోయినా ముందుగా వైద్యులను సంప్రదిస్తున్నారు.

గతవారం చైనా (China) నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ డాక్టర్ జలుబు, దగ్గు లక్షణాలతో ఫీవర్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అతడి రక్త నమూనాలను సేకరించి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరీక్షించగా కరోనా వైరస్‌ లేదని తేలింది.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే జ్వరంతో ఆదివారం మరో నలుగురు హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రిలో (Govt Fever Hospital) చేరారు. వీరిలో ముగ్గురు చైనా, హాంగ్‌కాంగ్‌ల నుంచి వచ్చిన వ్యక్తులు కాగా, మరొకరు వారిలో ఒకరి భార్య ఉన్నారు. ఈ నలుగురినీ ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

Here's ANI Tweet

అయితే, వీరిలో ఒక వ్యక్తిలో మాత్రమే జలుబు, దగ్గు, జ్వర లక్షణాలు కనిపించడంతో అతడి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం పుణెకు పంపించారు. ఈ ఫలితాలు సోమవారం వస్తాయని వైద్యవర్గాలు తెలిపాయి.

డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్

ప్రసార మాధ్యమాల్లో కరోనా వైరస్‌ గురించి వస్తున్న కథనాలతో భయాందోళనలకు గురై, స్వచ్ఛందంగా వారే హాస్పిటల్‌లో చేరినట్లుగా గవర్నమెంట్ ఫీవర్ ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ శంకర్ (Superintendent Dr. Shankar) తెలిపారు. ఈ నలుగురినీ నిశితంగా పరిశీలిస్తున్నామనీ, ప్రస్తుతానికి జలుబుకు సంబంధించిన సాధారణ చికిత్స మాత్రమే అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరోవైపు, నమూనాలు సేకరించిన వ్యక్తి ఫలితాల్లో పాజిటివ్ వచ్చినా.. హాస్పిటల్‌లోని వారి ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుండి విషమించినా.. అత్యవసర చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు.