Wuhan, February 10: ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ (Deadly Coronavirus) ఇప్పుడు చైనాను కుదిపేస్తోంది. ఆ దేశంలో (China) దాదాపు 908 మందికి పైగా ఈ వైరస్‌తో మృత్యువాత పడ్డారు. చైనాలోని వూహాన్‌లో(Wuhan) పుట్టిన కరోనా వైరస్ ఆ దేశాన్నే కాకుండా ఇప్పుడు ప్రపంచ దేశాలను కూడా గడగడలాడిస్తోంది. ఇప్పటికే కరోనా దెబ్బకు అనేక దేశాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాయి. రోజు రోజుకు వ్యాధి భారీన పడి మరణాల సంఖ్య పెరుగుతోందే కాని వ్యాధి మాత్రం కట్టడి కావడం లేదు. అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్
చైనాలో ఫిబ్రవరి 8 న ఒక్క రోజే 2019-nCoV నుండి కనీసం 97 మంది మరణించగా, ధృవీకరించబడిన కేసులు 40,171 కు చేరుకున్నాయని చైనా ఆరోగ్య అధికారులు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 300 కి పైగా సానుకూల కేసులు కూడా నమోదయ్యాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 3,062 కొత్త ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని సోమవారం ఉదయం బ్రీఫింగ్‌లో ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. మరణాల సంఖ్య 2002లో వచ్చిన తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) యొక్క సంఖ్యను దాటింది.
భారత్‌లో తొలి కరోనావైరస్ కేసు నమోదు
వ్యాప్తికి కేంద్రంగా ఉన్న హుబే ప్రావిన్స్ ఆదివారం 91 కొత్త మరణాలను నివేదించింది. ఈ వ్యాప్తి మొట్టమొదటిసారిగా హుబే యొక్క రాజధాని నగరమైన వుహాన్లో కనుగొన్న విషయం విదితమే.కాగా ఈ అంటు వైరస్ వ్యాప్తిని నిలిపివేయడానికి ప్రావిన్స్లోని 15 నగరాలను లాక్డౌన్ చేయాలని ప్రభుత్వం తెలిపింది.
చైనాలో చిక్కుకున్న భారతీయులను ఆఘమేఘాల మీద ఇండియాకు తరలింపు
కరోనా కారణంగా ఫిలిప్పీన్స్‌లో ఒకరు, హాంకాంగ్‌లో ఒకరు చనిపోయారు. భారత్‌లో (India) 3 నిర్ధారిత కేసులను గుర్తించారు. కేరళకు చెందిన ఆ ముగ్గురు ఇటీవల కరోనా విస్ఫోటనానికి కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ నగరం నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.
కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు బట్టబయలు
ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలు, పర్యాటకులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే చైనా పట్టణాలు ఇప్పుడు దెయ్యాల నగరాలుగా (Ghost towns) మారిపోతున్నాయి. కరోనా దెబ్బకు ప్రధాన పట్టణాలు..నిర్మానుష్యంగా మారిపోయాయి. షాపింగ్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన వాంగ్ పుజింగ్ వీధులు, మంచు కురుస్తున్న సందర్భంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే జింగ్ షాన్ పార్కు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. అక్కడ కేవలం మాస్క్‌లు ధరించిన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే కనిపిస్తున్నారు.
డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్
కరోనా కట్టడికి చైనా ప్రజాయుద్ధమే ప్రారంభించింది. ఇందుకోసం ప్రభుత్వం 1200 కోట్ల డాలర్లకు పైగా కేటాయించింది. కరోనా బాధితుల కోసం వుహాన్ శివార్లలో 10 రోజుల్లోపే వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించింది. ఇక కరోనా వ్యాధిని ఎదుర్కోవడానికి అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు వివిధ దేశాల శాస్త్రవేత్తలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. లక్షల కోట్ల డాలర్ల వ్యయంతో సంయుక్తంగా ఈ ప్రాజెక్టు చేపట్టారు.
కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయటంలో గొప్ప పురోగతి
కరోనా మీద ప్రపంచ దేశాలు సున్నితంగా స్పందించాలని చైనా కోరుతోంది. సోషల్ మీడియాలో కరోనా వైరస్‌ను ‘వుహాన్ వైరస్’, ‘చైనా వైరస్’అని పిలవడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది చైనా అర్థిక వ్యవస్థపై తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందిన నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పలు దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. చైనా నుంచి భారీగా బల్క్ డ్రగ్‌ను దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఈ పరిస్థితుల్లో చైనా నుంచి బల్క్ డ్రగ్ దిగుమతులు నిలిచి పోతే.. ఫార్మారంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
కరోనా వైరస్ కారణంగా సంక్షోభంలోకి వెళుతున్న చైనాకు భారత్ స్నేహ హస్తం అందించింది. కరోనా కట్టడికి అవసరమైన ఏ సాయమైనా చేసేందుకు భారత్ సిద్ధమని తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఆదివారం లేఖ రాశారు. కరోనా కారణంగా మరణించిన కుటుంబాలకు మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చైనీయులకు సంఘీభావం తెలిపారు.
ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రాయాలలో స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు
గత వారం చైనా నుంచి 650 మంది భారతీయుల్ని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో జిన్‌పింగ్ అందించిన సహకారాన్ని ప్రధాని మోదీ తన లేఖలో కొనియాడారు. చైనాలోని భారతీయుల ఆరోగ్యం, భద్రత విషయంలో భారత్‌తో సమన్వయం చేసుకునేందుకు, కరోనాను ఎదుర్కొనే విషయంలో భారత్ సాయం తీసుకునేందుకు చైనా సిద్ధంగా ఉందని భారత్‌లో చైనా రాయబారి సున్ వీడాంగ్ పేర్కొన్నారు.