Wuhan, Febuary 5: కరోనా వైరస్ (Coronavirus) ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ఒకే ఒక వ్యాధి. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 500 మంది వరకు చనిపోగా.. 20 వేల మందికి వైరస్ సోకింది. వైరస్ సోకిన వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చైనా నగరంలోని వుహాన్ లో (Wuhan In China) పుట్టిన ఈ వైరస్ గురించి వింటేనే జనాలు వణికిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి వైరస్(Deadly coronavirus) ను ఓ బ్రిటిష్ వ్యక్తి మాత్రం తాను వైరస్‌ను ఓడించానని చెబుతున్నాడు.
డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్
ఈ ప్రాణాంతక వ్యాధిని తేనె, మద్యంతో అరికట్టవచ్చని ఓ బ్రిటీష్ ఉపాధ్యాయుడు (British Teacher) చెబుతున్నాడు. కానర్ రీడ్ (Connor Reed) అనే బ్రిటీష్‌కు చెందిన టీచర్ వుహన్‌లోనే ఉంటున్నారు. రెండునెలల క్రితం వైరస్ లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. అయితే అందరిలా అతను కూడా భయపడ్డారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందికి గురవడంతో బ్రిత్ ఆనలైజర్ కూడా పెట్టుకున్నారు. రెండు వారాలు ఆస్పత్రిలో ఉన్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా నా శరీరంలో చిన్న క్రిమి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. రెండు వారాలు పాటు ఆసుపత్రిలో ఉండాలని డాక్టర్లు సూచించారు. ఇక నాకు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండటంతో బ్రీత్ అనలైజర్ కూడా పెట్టుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే డాక్టర్లు సూచించిన ఆంటీ బయాటిక్ మందులను సున్నితంగా తిరస్కరించానని.. సొంత వైద్యానికే మొగ్గు చూపానని తెలిపాడు.
హైదరాబాద్‌లో కరోనా వైరస్ అలజడి
వ్యాధి నివారణలో భాగంగా.. ఒక గ్లాసు వెచ్చని విస్కీలో తేనె కలుపుకుని తాగే వాడినని (hot whiskey and honey) ఇలా క్రమంగా తీసుకోవడంతో తన ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని తనలో ఉన్న ఆ వైరస్‌కూడా చనిపోయిందని పేర్కొన్నాడు. ఇక తాను పూర్తిగా కోలుకోవడానికి తగిన విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందన్నాడు. ఇలా విస్కీతో తాను ఆ వైరస్‌ను జయించానని పేర్కొన్నాడు. కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు వెల్లడించిన సైంటిస్టులు
కాగా తనకు వచ్చి ఆ వ్యాధి లక్షణాలు, కరోనా వైరస్ లక్షణాల ఒకేలా ఉన్నాయని, ఒకవేళ నాకు సోకింది కరోనా వైరస్ అయ్యుంటే ఇలా విస్కీ, తేనెతో ఆరికట్టవచ్చు అని చెప్పుకొచ్చాడు. ఈ టీచర్ మూడేళ్లుగా చైనాలో ఉంటున్నాడు. తన ఉంటున్న వుహాన్ గురించి మాట్లాడుతూ.. ఎప్పుడూ జనసంద్రంగా ఉండే వుహాన్ కరోనా వల్ల ఒక్కసారిగా దెయ్యాల నగరంగా మారిందన్నాడు. ఇక్కడి ప్రజలు బయట కాలు పెట్టడానికే జంకుతున్నారని, ఇక ముసుగు లేకుండా బయటకు వస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని తెలిపాడు.