Coronavirus Deaths: శ్మశానాలుగా మారుతున్న చైనా నగరాలు, అప్పుడే పుట్టిన పాపకు కరోనా వైరస్, ఒక్కరోజులోనే 88 మంది మృత్యువాత, 724కి చేరిన మృతుల సంఖ్య, భారీనపడిన వారి సంఖ్య 30వేలకు పైగానే..
Coronavirus Outbreak in China (Photo Credits: IANS)

Wuhan, Febuary 8: చైనాలో కరోనా మృత్యు తాండవం చేస్తోంది. రోజు రోజుకు కరోనాతో (Coronavirus outbreak)మృతి చెందే వారి సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వైరస్ బారిన పడి వందల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. పలు నగరాలు శ్మశానంలా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వూహాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చైనాలో ఒక్కరోజే మరో 88 మంది ప్రాణాలు (Coronavirus Deaths) గాలిలో కలిసిపోయాయి.  ప్రపంచానికి పెను ముప్పు

2020, ఫిబ్రవరి 08వ తేదీ శనివారానికి మరణించిన వారి సంఖ్య 724కి చేరింది. ఒక్క ప్రావిన్స్‌లో 79 మంది చనిపోవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక వైరస్ బారిన పడిన వారి సంఖ్య (Coronavirus Cases) 34 వేల 872కి చేరింది. ఇందులో కొంతమంది కోలుకున్నట్లు చైనా ప్రభుత్వం (China Government) వెల్లడిస్తోంది. భారత్‌లో తొలి కరోనావైరస్ కేసు నమోదు

శుక్రవారం నాటికి చైనా కరోనా మృతుల సంఖ్య 636గా ఉండగా..శనివారానికి మృతుల సంఖ్య 724కు (Total Coronavirus Deaths) చేరింది. ఇంకా విషాదకరమైన విషయం ఏమిటంటే.. అప్పుడే పుట్టిన పాపకు కూడా కరోనా పాజిటివ్ అని తేలడం. కరోనా వైరస్ సోకిన గర్భిణీ ఒక పాపకు జన్మనివ్వగా..పాపను 30 గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆ తర్వాత ఆ పాపకు కూడా కరోనా వైరస్ సోకిందని తేలడంతో సదరు ఆస్పత్రి వైద్యులు దిగ్బ్రాంతి చెందారు. గతంలో కూడా వైరస్ సోకిన గర్భిణీ పాపకు జన్మనివ్వగా ఆ పాప పూర్తి ఆరోగ్యంగా ఉంది.

చైనాలో చిక్కుకున్న భారతీయులను ఆఘమేఘాల మీద ఇండియాకు తరలింపు

సార్స్ వైరస్ బారినపడి మృతి చెందిన వారి కంటే కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. హుబెయ్ ప్రావిన్స్ లోనే 79 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 3,399 మందికి కరోనా పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో ఈ వైరస్ బాధితుల సంఖ్య 34,872కు చేరింది. కరోనా వ్యాప్తికి మూలమైన వుహాన్ ఇంకా నిర్భందం లోనే ఉండగా..హాంకాంగ్ లో కూడా ఇదే తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి.

తెలంగాణలో కరోనా వైరస్  లేదు :  రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

హుబెయ్ ప్రావిన్సు, రాజధాని వూహాన్ (Wuhan) ఇంకా దిగ్భందనంలో కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. భారత్‌తో (India) సహా 25 దేశాల్లో ఈ వైరస్ పాకుతోంది. దీంతో పలు దేశాలు చైనాకు వెళ్లకుండా...ఆంక్షలు విధిస్తున్నాయి. దీనిపై WHO స్పందించింది. వైరస్ సోకిన వారిలో ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉన్నట్లు తెలిపింది.

కరోనావైరస్ గుట్టు విప్పేశారు, షాకింగ్ నిజాలు బట్టబయలు

కాగా కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలకు.. అమెరికా ఆర్థిక సహాయం ప్రకటించింది. చైనాతో (China) పాటు ఇతర ప్రభావిత దేశాలకు 100 మిలియన్ డాలర్లను సహాయాన్ని అమెరికా (America) అందించనుంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడారు. చైనాలో ఆరోగ్య పరిస్థితులు ట్రంప్‌కి వివరించారు.

డాక్టర్లను చంపేస్తున్న కరోనావైరస్

ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ కట్టడికి చైనా చేస్తున్న పోరాటాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రశంసించారు. డ్రాగన్‌ దేశానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని తెలిపారు. కాగా అమెరికాలో ఇప్పటివరకు 12 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో చైనా ప్రయాణాలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది. వైరస్‌పై పోరులో భాగంగా ప్రపంచస్థాయి నిపుణుల్ని పంపేందుకు అమెరికా ముందుకు వచ్చిందని అక్కడి అధికారులు తెలిపారు.