New Dlehi, Mar 04: 'హోళీ మిలన్ వేడుకలు (Holi Milan 2020) భారతీయులకు చాలా కీలకం. అయితే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus Spread) చెందేందుకు అవకాశాలు ఉండటంతో ఈ ఏడాది హోళీ వేడుకలకు (Holi Milan) ప్రముఖులు ఒక్కొక్కరే దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా (Amit Shah) 'హోళీ మిలన్'లో తాను పాల్గొనడం లేదని బుధవారంనాడు ప్రకటించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశాలున్నందున ఈ ఏడాది హోళీ వేడుకల్లో పాల్గొనరాదని నిర్ణయించుకున్నాను. జనం ఎక్కువగా గుమిగూడే చోట్లకు దూరంగా ఉండి, ప్రతి ఒక్కరూ తమ పట్ల, తమ కుటుంబం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను' అని అమిత్‌షా ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Kejriwal) సైతం ఈ ఏడాది హోళీ వేడుకలు జరుపుకోవడం లేదని ప్రకటించారు. 'కరోనా వైరస్ వ్యాప్తి, ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్లలో పలువురు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ ఏడాది నేను హోళీ ఉత్సవాలు (Holi Milan 2020 Programme) చేసుకోవడం లేదు. ప్రజలు ఎన్నో కష్టనష్టాల్లో ఉన్నారు. ఆ కారణంగానే నేను కానీ, మా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ హోళీ జరుపుకోవడం లేదు' అని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు.
15 మంది ఇటలీ పర్యాటకులకు కోవిడ్-19 వైరస్
కరోనా వైరస్‌తో ఎదురయ్యే పరిస్థితిని అదుపు చేసేందుకు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు కేజ్రీవాల్ ఈ సందర్భంగా తెలిపారు. తన అధ్యక్షతను ఏర్పాటు చేసే టాస్క్ ఫోర్స్‌లో పలు ఏజెన్సీలు, డిపార్ట్‌మెంట్‌లు, కార్పొరేషన్ల సభ్యులు ఉంటారని, ప్రతి ఒక్కరికీ ఒక్కో బాధ్యత అప్పగిస్తామని చెప్పారు.
ఆస్పత్రి డైరక్టర్‌ను కరోనా చంపేసింది
కాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రజలు ఒక సమూహంగా గుమిగూడవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ ఏడాది హోళీ పండుగలో పాల్గొనరాదని తాను నిర్ణయించుకున్నట్టు ఆ ట్వీట్‌లో తెలిపారు. హోళీ వేడుకల వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని, జనం గుంపులుగా ఉండే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కోరారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలను అందరూ పాటించాలని మోడీ ట్వీట్ చేశారు.
కరోనా కలవరం, హోలీ వేడుకలకు దూరంగా ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా ఇంతవరకూ కరోనా వైరస్‌కు సంబంధించి 28 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర హోం మంత్రి హర్షవర్దన్ బుధవారం తెలిపారు. కరోనా వైరస్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా ఇంతవరకూ 3,000 మందికి పైగా మృత్యువాత ప్డడారు. మరో 80,000 మంది కరోనా వైరస్‌తో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్‌లో మరో 36 మందికి కరోనావైరస్ లక్షణాలు?
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగాహోళీ వేడుకలను ఈ ఏడాది రద్దు చెయ్యాలంటూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాస్ గ్యాదరింగ్.. ఎక్కువమంది ఒక చోట గుమికూడకపోవడమే మేలు అని అందుకు న్యాయపరంగా ఆదేశాలు ఇవ్వాంటూ కొందరు పిటీషన్ దాఖలు చేశారు. హైదరాబాద్‌లో కూడా కరోనా కారణంగా హోళీ వేడుకలు రద్దు చెయ్యాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ మహిళా నాయకురాలు గంపా సిద్ధా లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు