Prime Minister Narendra Modi | File Image | (Photo Credits: ANI)

New Delhi, March 4: ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న కోవిడ్ 19 వైరస్ (COVID 19) ఇండియాను (India) కూడా ముప్పతిప్పలు పెడుతోంది. దీని వల్ల ఇండియాకి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపినప్పటికీ లోలోపల మాత్రం ప్రజలు భయంతో బతుకుతున్నారు. ఎక్కడ తమపై దాడి చేస్తోందోనని హడలిపోతున్నారు. దీని దెబ్బకు పండుగలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని (PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇండియాపై కరోనా దాడి, 15 మంది ఇటలీ పర్యాటకులకు కోవిడ్‌-19 వైరస్

కోవిడ్‌-19 (Coronavirus) వ్యాప్తిపై ఉలాంటి ఆందోళన అవసరం లేదని ప్రకటించిన భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) హోళీ వేడుకలకు దూరమని ప్రకటించారు. పెరుగుతున్న కరోనా వైరస్ ఆందోళనల దృష్ట్యా, ఈ సంవత్సరం హోళీ వేడుకలకు (Holi Milan 2020 Programme) దూరంగా వుంటున్నానని ట్విట్టర్ ద్వారా ప్రధాని ప్రకటించారు.

అలాగే ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు హోళీ (Holi 2020) పండుగ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

PM Modi's Tweet:

ఈ మేరకు ట్విటర్లో ఒక సందేశాన్ని ట్వీట్‌ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సామూహిక సమావేశాలను తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా ఇటలీనుంచి వచ్చిన టూరిస్టులు 15 మందికి వ్యాధి సోకినట్టుగా బుధవారం నిర్ధారణ అయింది. దీంతో తాజా కేసులతో భారతదేశంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య 21కి చేరింది.