
Amaravati, Mar 09: దేశంలో రోజు రోజుకు పంజా విప్పుతున్న కరోనా వైరస్ (Coronavirus Terrifies) ధాటికి రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు తిరుమలలోని శ్రీవారి దర్శనంపై (Lord Venkateswara Swamy temple) ఆంక్షలు విధించారు.
తిరుమల కొండపై మద్యం తాగుతూ, చికెన్ తింటూ..
కరోనా వైరస్ లక్షణాలైన జలుబు, దగ్గు ఉన్న భక్తులు తిరుమలలోని శ్రీవారి దర్శనానికి (Tirumala Temple) రావద్దని టీటీడీ అధికారులు (TTD Management) సలహా ఇచ్చారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా జలుబు, దగ్గు ఉన్న భక్తులకు దర్శన భాగ్యం కల్పించకుండానే వెనక్కి పంపించాలని టీటీడీ అధికారులు సిబ్బందిని ఆదేశించారు.
తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ వల్ల కరోనా వైరస్ సులభంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందువల్ల జలుబు, దగ్గు, జ్వరం ఉన్న భక్తులు తమ తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు. జలుబు,దగ్గు,జ్వరం భాదపడేవాళ్లు ఎవరైనా ఉంటే వాళ్లు తిరుమల శ్రీవారి దర్శనానికి రావద్దని టీటీడీ అధికారులు భక్తులను కోరారు.
కరోనావైరస్ లక్షణాలు భక్తుల్లో ఎవరికైనా కనిపిస్తే వెంటనే వారిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) కు తరలించాలని ఆలయ అధికారులు ఆదేశించారు. కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా భక్తులు సానిటైజర్, మాస్కులు వెంట తీసుకురావాలని టీటీడీ అధికారులు సూచించారు.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ పలు దేశాలకు వ్యాపించింది. దేశంలో ఇప్పటికే 40కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తిరుమలలోని శ్రీవారి దర్శనంపై ఆంక్షలు విధించారు.