Fuel Prices Today: దేశంలో ఆగని పెట్రోమంటలు, వరుసగా 20 వరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు, నేడు పెట్రోల్‌ లీటర్‌కు 21 పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెంపు

దేశంలో పెట్రో మంటలు (Petro Price Fire) కొనసాగుతున్నాయి. శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 21 పైసలు ( Fuel Prices Today), డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 82.96 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర (Diesel price in Delhi) లీటర్‌కు 80.13కు, డీజిల్‌ లీటర్‌కు 80.19 రూపాయలకు ఎగబాకింది.

Fuel Prices Today: దేశంలో ఆగని పెట్రోమంటలు, వరుసగా 20 వరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంపు, నేడు పెట్రోల్‌ లీటర్‌కు 21 పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెంపు
Petrol Price In India | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, June 26: దేశంలో పెట్రో మంటలు (Petro Price Fire) కొనసాగుతున్నాయి. శుక్రవారం వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. పెట్రోల్‌ లీటర్‌కు 21 పైసలు ( Fuel Prices Today), డీజిల్‌ ధర లీటర్‌కు 17 పైసలు పెరిగింది. పెరిగిన ధరతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 82.96 రూపాయలకు చేరింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర (Diesel price in Delhi) లీటర్‌కు 80.13కు, డీజిల్‌ లీటర్‌కు 80.19 రూపాయలకు ఎగబాకింది. కరోనా కల్లోలానికి తిరునల్వేలి హల్వా యజమాని ఆత్మహత్య, దేశంలో రికార్డు స్థాయిలో 17,296 కేసులు నమోదు, 5 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు

ఇక పెట్రో భారాలపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నా ధరల సవరణ పేరుతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇంధన ధరలను రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నాయి. కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న ఈ తరుణంలో ప్రజలపై పెట్రో భారాలను మోపడం సరైంది కాదని వినియోగదారులు వాపోతున్నారు. మరోవైపు పెట్రో ధరలను మించి డీజిల్‌ ధర పరుగులు తీయడంతో నిత్యావసరాల ధరలూ చుక్కలు చూస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

హైదరాబాద్‌‌లో గురువారం లీటరు పెట్రోల్ ధర రూ. 83.18, డీజిల్‌ ధర రూ.78.36 పైసలు.అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 22 పైసలు పెరిగింది. దీంతో ధర రూ.83.53కు చేరింది. డీజిల్‌ ధర కూడా 17 పైసలు పెరుగుదలతో రూ.78.67కు ఎగసింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర లీటర్ రూ.83.13కు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్ రూ.78.30కు ఎగసింది.

20రోజుల్లో పెట్రోల్‌ లీటర్‌కు రూ.8.93పైసలు, డీజిల్‌ లీటర్‌కు రూ.10.07పైసలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 80.13 పైసలు, డీజిల్‌ ధర 80.19, చెన్నైలో పెట్రోల్‌ రూ. 83.37, డీజిల్‌ ధర రూ.77.44పైసలు పెరిగాయి. కోల్‌కతాలో పెట్రోల్‌ లీటర్‌కు రూ. 81.82, డీజిల్‌ ధర రూ.75.34 పైసలు పెరిగాయి. ముంబైలో పెట్రోల్‌ రూ. 86.91, డీజిల్‌ ధర రూ.78.51 పైసలుగా ఉంది.

(The above story first appeared on LatestLY on Jun 26, 2020 11:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).