New Delhi, June 26: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య (COVID-19 in India) అంతకంతకూ పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటలలో అత్యధికంగా 17,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 407 మంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల (Coronavirus Pandemic) సంఖ్య 4,90,401కు చేరుకోగా, మొత్తం 15,301 మంది (Coronavirus Death Toll) మరణించారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,89,463గా ఉంది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,85,636 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆగష్టు 12 వరకు వరకు రైళ్లు రద్దు! కీలక నిర్ణయాన్ని ప్రకటించిన రైల్వేశాఖ, ఇప్పటికే బుక్ చేసుకున్న వారందరికీ రిఫండ్ చెల్లిస్తున్నట్లు వెల్లడి
ఇప్పటి వరకు 77,76,228 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. కాగా, గురువారం ఒక్కరోజే 16,922 కొత్త కేసులు నమోదు కాగా, మరో 418 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. జూన్ 25 వరకు దేశవ్యాప్తంగా 77,76,228 నమూనాలను పరీక్షించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించింది. నిన్న ఒక్కరోజే దేశంలో 2,15,446 పరీక్షలు చేశామని తెలిపింది.
దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 4841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తంగా 1,47,741 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో 6,931 మంది బాధితులు మృతిచెందగా, 77,453 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 63,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ఉన్న ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 73,780కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2429 మంది బాధితులు మృతి చెందారు. దేశ రాజధానిలో నిన్న ఒక్కరోజే 3390 పాజిటివ్ కేసులు నమోదవగా, 64 మంది మరణించారు. కరోనాకు మందు వచ్చేసింది, మొదటి విడతగా 5 రాష్ట్రాలకు 20 వేల రెమ్డీస్వీర్ ఇంజక్షన్లను సరఫరా చేసిన హెటిరో సంస్థ, 3,4 వారాల్లో లక్ష ఇంజక్షన్లు అందుబాటులోకి
మూడవ స్థానంలో ఉన్న దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఇప్పటివరకు 70,977 పాజిటివ్ కేసులు నమోదవగా, 911 మంది మృతిచెందారు. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన తిరునల్వేలి ఇరుట్టు కడాయి హల్వా యజమాని హరిసింగ్(70) కరోనా వ్యాధి సోకడంతో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన అనూహ్యంగా ఉరివేసుకుని చనిపోవడం కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. యూరినరీ ఇన్‌ఫెక్షన్ తో బాధపడుతున్న సింగ్‌ను మంగళవారం ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా గురవారం ఉదయం పాజిటివ్ గా తేలడంగా ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరోవైపు హరిసింగ్ అల్లుడు కూడా కోవిడ్-19 బారిన పడినట్టు తెలుస్తోంది.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగిస్తామని తిరునెల్వేలి డిప్యూటీ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) ఎస్ శరవణన్ తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది ఇరుట్టు కడాయి హల్వా. 100 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ దుకాణం ఇప్పటికీ తిరునల్వేలిలో పర్యాటక కేంద్రంగా ఉందంటే ఈ హల్వా ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
నాలుగో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 29,520 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1753 మంది మరణించారు. అయిదవ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో గురువారం 636 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 20,193కు చేరగా, ఈ వైరస్ వల్ల 611 మంది చనిపోయారు. ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్‌లో మొత్తం కేసుల సంఖ్య 16,296కి చేరింది. ఇప్పటివరకు 379 మంది మృతిచెందారు. 15,648 కేసులతో పశ్చిమబెంగాల్, 12,596 కేసులతో మధ్యప్రదేశ్, 12,463 కేసులతో హర్యానా, 11,364 కేసులతో తెలంగాణ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.