New Delhi, June 25: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో భారతీయ రైల్వేస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ మరియు సబర్బన్ సర్వీసులతో సహా అన్ని రైగ్యులర్ రైలు సర్వీసులను ఆగస్టు 12 వరకు రద్దు చేసినట్లు రైల్వే బోర్డు గురువారం ప్రకటించింది. జూలై 1 నుంచి ఆగష్టు 12 వరకు బుక్ చేసుకున్న వారి టికెట్లను క్యాన్సల్ చేసినట్లు రైల్వేబోర్డ్ తెలిపింది. రద్దైన టికెట్లన్నింటికీ ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది.
అయితే, లాక్డౌన్ సమయంలో మోషన్‌లో ఉంచిన 230 ప్రత్యేక రైళ్లు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని రైల్వేశాఖ పేర్కొంది. మే 12 మరియు జూన్ 1న ప్రారంభించబడిన స్పెషల్ రాజధాని మరియు ఇతర రాష్ట్రాల్లో చిక్కుక్కున వారిని స్వరాష్ట్రాలకు తరలించే శ్రామిక్ రైళ్లు, స్పెషల్ మెయిల్ / ఎక్స్‌ప్రెస్ సేవలు కొనసాగుతాయని తెలిపింది.
Indian Railways Cancels All Regular Trains Till August 12:
It has also been decided that all the ticket booked for the regular time-tabled trams for the journey date from 01.07.20 to 12.08.20 also stand cancelled: Railway Board https://t.co/t62D3GjOUP
— ANI (@ANI) June 25, 2020
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ ప్రారంభమైన మార్చి 24 నుండి అన్ని సాధారణ రైలు సర్వీసులు రద్దు చేయబడ్డాయి. వీటికి ముందస్తు రిజర్వేషన్లను కూడా ఏప్రిల్ 15 నుంచి ఐఆర్‌సిటిసి నిలిపివేసింది. అయితే కరోనావైరస్ అదుపులోకి రాకపోవడంతో రైలు సర్వీసుల నిలిపివేతను రైల్వేశాఖ క్రమక్రమంగా పొడగించుకుంటూ వచ్చింది. అయితే దేశంలో కరోనావైరస్ వ్యాప్తి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో మరోసారి రైళ్లను రద్దును ఆగష్టు రెండో వారం వరకు పొడగించారు.