GST Council Meeting Highlights: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఇవే.. జీఎస్టీ వ్యాపారులను అరెస్టు చేసే అధికారం రద్దు.. వస్తువుల డెలివరీపై రేటును 18% నుండి 5%కి తగ్గించే చర్యలు..

దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు , పన్ను వేధింపులను అరికట్టేందుకు జీఎస్టీ కౌన్సిల్ పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను చెల్లింపుదారులు, చిన్న వ్యాపారులు , కార్పొరేట్ రంగానికి ఊరట కలిగించేలా కౌన్సిల్ విస్తృత సవరణలకు ఆమోదం తెలిపింది.

Union Finance Minister Nirmala Sitharaman (Photo Credits: PIB)

GST Council Meeting Highlights: దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు , పన్ను వేధింపులను అరికట్టేందుకు జీఎస్టీ కౌన్సిల్ పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను చెల్లింపుదారులు, చిన్న వ్యాపారులు , కార్పొరేట్ రంగానికి ఊరట కలిగించేలా కౌన్సిల్ విస్తృత సవరణలకు ఆమోదం తెలిపింది.

ముఖ్యంగా సాధారణ జీఎస్టీ వివాదాల్లో అధికారులకు ఉన్న నేరుగా అరెస్టు చేసే అధికారాలను రద్దు చేయడంతో పాటు, ప్రాసిక్యూషన్ పరిమితిని రూ.1 కోటి నుంచి ఏకంగా రూ.5 కోట్లకు పెంచడం వ్యాపార వర్గాలకు అతిపెద్ద ఊరటగా నిలిచింది. తీవ్రమైన క్రిమినల్ కేసులు , ఉద్దేశపూర్వక మోసాలు మినహా మిగిలిన పన్ను వివాదాలను కేవలం చట్టబద్ధమైన న్యాయ ప్రక్రియల ద్వారానే పరిష్కరించాలని నిర్ణయించారు.  క్యాన్సర్ మందులపై కేంద్రం కీలక నిర్ణయం.. ట్రేడ్ మార్జిన్ 30 శాతానికి పరిమితం.. మందుల ధరలు భారీగా తగ్గే అవకాశం..

చిన్న వ్యాపారులను ప్రోత్సహించే దిశగా , అనవసరపు నోటీసుల భయాన్ని తొలగించేందుకు కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రూ.10,000 కంటే తక్కువ పన్ను డిమాండ్ ఉన్న కేసుల్లో ఎలాంటి షో-కాజ్ నోటీసులు జారీ చేయబడవు. అంతేకాకుండా సాధారణ జరిమానాను రూ.25,000 నుంచి రూ.10,000కు తగ్గించారు. రూ.5 కోట్ల వరకు వార్షిక టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారులకు సులభమైన రిటర్న్ ఫైలింగ్ విధానం, చిన్న ఈ-కామర్స్ వ్యాపారాలు , తక్కువ-రిస్క్ ఉన్న దరఖాస్తుదారులకు ఆటోమేటిక్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే జీఎస్టీ ప్రక్రియల్లో మరింత పారదర్శకత కోసం ఐటీ శాఖ తరహాలోనే సీజీఎస్టీలో కూడా ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ విధానాన్ని ప్రారంభించనున్నారు.

పన్ను రేట్లపరంగా కూడా పలు రంగాలకు గణనీయమైన ఉపశమనం లభించింది. రిజిస్టర్ కాని డెలివరీ రైడర్లు అందించే వస్తువుల డెలివరీ సేవలపై జీఎస్టీ రేటును 18% నుంచి 5%కి తగ్గించారు. అలాగే వ్యవసాయ రంగానికి లబ్ధి చేకూరుస్తూ రీ-ట్రెడెడ్ ట్రాక్టర్ టైర్లపై పన్నును 18% నుంచి 5%కి కుదించారు. రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేస్తూ 3 రోజుల్లో 90% క్లెయిమ్‌లకు ఆమోదం తెలపడంతో పాటు, 10 రోజుల్లోపు రీఫండ్ల ఆమోదం, 17 రోజుల్లోపు నిధుల పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టనున్నారు. ఉద్యోగులకు గ్రూప్ హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ అందించే కంపెనీలకు ఆయా ప్రీమియంలపై చెల్లించిన జీఎస్టీపై ఇన్పుట్ ట్యాక్ష్ క్రెడిట్ (ఐటీసీ) పొందేందుకు అనుమతినిచ్చారు.

కార్పొరేట్ రంగానికి సంబంధించి ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, టెలికామ్ , మౌలిక సదుపాయాల రంగాలు ఈ నిర్ణయాల వల్ల అత్యధిక లబ్ధి పొందనున్నాయి. ఫ్యాక్టరీ ప్రాంగణాల వెలుపల ఏర్పాటు చేసే టెలికామ్ టవర్లు, పైప్‌లైన్ల మూలధన వ్యయంపై ఐటీసీ పొందేందుకు మార్గం సుగమమైంది. కంపెనీలు తమ వ్యాపార ప్రచారం కోసం ఇచ్చే ఉచిత నమూనాలు (Free Samples), గడువు ముగిసి చట్టప్రకారం ధ్వంసం చేయాల్సిన ఔషధాలు/ఉత్పత్తులపై చెల్లించిన జీఎస్టీకి ఐటీసీ సౌకర్యాన్ని కల్పించారు.

దీనితో పాటు పరిశోధన ఉత్పత్తుల దిగుమతిపై 18% జీఎస్టీ మినహాయింపునిచ్చారు. పన్ను నిబంధనలలో స్థిరత్వం కోసం ఇకపై జీఎస్టీ రేట్ల మార్పులు, సమీక్షలను సంవత్సరానికి ఒకసారి మాత్రమే పరిశీలించనున్నట్లు కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ నూతన సవరణలు, ఆటోమేషన్ ప్రక్రియలు , ప్లాంట్ & మెషినరీ ఐటీసీ రీఫండ్లు 1 ఏప్రిల్ 2027 నాటికి అమల్లోకి రానున్నాయి.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement