Haryana Shocker: తల్లి ఎదుటే రెచ్చిపోయిన కామాంధులు, ఇద్దరు కూతుర్లపై నలుగురు దారుణంగా అత్యాచారం, ఆపై పురుగుమందు తాగించడంతో చనిపోయిన అక్కాచెళ్లెల్లు, హర్యానాలో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

దేశంలో కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా హరియాణా రాష్ట్రం సోనిపట్ పరిధిలో తల్లిని బెదిరించి.. ఇద్దరు బాలికలపై నలుగురు అత్యాచారానికి (4 Men Rape Minor Sisters) పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం వారితో పురుగుల మందు తాగించడంతో (Consume Insecticide In Haryana) వారిద్దరూ మృతిచెందారు.

Haryana Shocker: తల్లి ఎదుటే రెచ్చిపోయిన కామాంధులు, ఇద్దరు కూతుర్లపై నలుగురు దారుణంగా అత్యాచారం, ఆపై పురుగుమందు తాగించడంతో చనిపోయిన అక్కాచెళ్లెల్లు, హర్యానాలో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Image used for representational purpose | (Photo Credits: File Image)

Sonipat, August 11: దేశంలో కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా హరియాణా రాష్ట్రం సోనిపట్ పరిధిలో తల్లిని బెదిరించి.. ఇద్దరు బాలికలపై నలుగురు అత్యాచారానికి (4 Men Rape Minor Sisters) పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం వారితో పురుగుల మందు తాగించడంతో (Consume Insecticide In Haryana) వారిద్దరూ మృతిచెందారు.

సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పోలీసులు (Haryana Police) మీడియా సమావేశంలో తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సోనిపట్ (Haryana's Sonipat) పరిధిలో ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసిస్తోంది. వారి వయసు 14, 16 ఏళ్లు. తల్లి కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే వీరి పక్క ఇంట్లోనే కొందరు వలస కార్మికులు నివసిస్తున్నారు. వీరి కన్ను పక్కనే ఉన్న ఆ అక్కాచెల్లెళ్లపై పడింది. ఈ క్రమంలో ఆ నలుగురు ఆగస్టు 5, 6 తేదీన అర్ధరాత్రి వారి ఇంట్లోకి చొరబడి.. ఆమె తల్లిపై దాడి చేశారు.

నిందితుడు రేప్ చేసింది 11 నిమిషాలే.. బాధితురాలికి ఎక్కువ గాయాలు కూడా కాలేదు, అందువల్ల నిందితునికి శిక్ష తగ్గిస్తున్నామని తెలిపిన స్విట్జర్లాండ్‌ బాసెల్‌ కోర్టు, ఇదేం తీర్పు అంటూ బాసెల్‌ నగరవ్యాప్తంగా నిరసన గళం వినిపిస్తున్న ప్రజలు

ఆమె అచేతనావస్థలో ఉండగా ఆమె ఎదుటే కూతుళ్లపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆ తరువాత వారితో పురుగుల మందు తాగించారు. అనంతరం ఆ ఇద్దరు బాలికలు అపస్మారక స్ధితికి చేరుకున్నారు. బాలికల పరిస్థితి విషమించడంతో.. పాము కరిచినట్లు పోలీసులకు చెప్పాలని తల్లిని నలుగురు నిందితులు బెదిరించారు. తల్లి సరేనని అంగీకరించడంతో కుమార్తెలను ఢిల్లీలోని ఆస్పత్రికి తీసుకువచ్చింది. అయితే మార్గమధ్యంలోనే ఓ బాలిక చనిపోయింది. మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

కారులో సెక్స్ చేస్తూ అడ్డంగా దొరికిన పోలీస్ జంట, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెక్సికోలో వేస్ట్ ఫీల్డ్ ప్రాంతంలోని పోలీస్ సెక్స్ వీడియో, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసిన అధికారులు

ఆమె తల్లి ప్రాణభయంతో ఆస్పత్రిలో వైద్యులకు గానీ, పోలీసులకు అసలు విషయం చెప్పలేదు. వారికి పాము కాటేసిందనే చెప్పింది. అధికారులు పోస్టుమార్టం నిర్వహించగా బాలికల మీద లైంగిక దాడి జరిగిన విషయం బయటపడింది. అంతేకాదు వారిమీద విషప్రయోగం జరిగిందని కూడా నిర్ధారణ అయ్యింది. దీంతో పోలీసులు ఆమె తల్లిని గట్టిగా అడగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేశారు.

(The above story first appeared on LatestLY on Aug 11, 2021 04:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).