Berlin, Aug 10: మహిళపై అత్యాచారం కేసులో స్విట్జర్లాండ్ బాసెల్ కోర్టు (Basel courthouse) వివాదాస్పద తీర్పు వెల్లడించింది. ‘‘నిందితుడు కేవలం 11 నిమిషాల పాటే (11 minutes Rape) అత్యాచారం చేశాడు.. బాధితురాలిని పెద్దగా గాయపర్చలేదు. కనుక అతడికి విధించిన శిక్షను తగ్గిస్తున్నాం’’ అని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పట్ల స్విట్జర్లాండ్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసెల్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. సోషల్ మీడియాలో ఈ నిరసనల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తీర్పుకు వ్యతిరేకంగా వారు సోషల్ మీడియా వేదికగా నిరసన స్వరం వినిపిస్తున్నారు.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. స్విట్జర్లాండ్ వాయువ్య ప్రాంతంలోని ఓ నగరానికి చెందిన బాధితురాలిపై గతేడాది ఫిబ్రవరిలో పోర్చుగల్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ఆమె ప్లాట్‌లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనకు మరో 17 ఏళ్ల మైనర్ అతడికి సహకరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరినీ కోర్టులో హాజరపరిచారు. ఈ నేరానికి సంబంధించి కోర్టు ఆగస్టు, 2020లో ఇద్దరికీ శిక్ష విధించింది. 31 ఏళ్ల వ్యక్తికి 4 సంవత్సరాల 3నెలల శిక్ష విధించగా... మైనర్‌ని జువైనల్ హోంకి తరలించింది.
తాజాగా కోర్టు (Swiss Protest Court) గతంలో నిందితుడికి తాను విధించిన 51 నెలల జైలు శిక్షను 36 నెలలకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది. బాసెల్ కోర్టు ప్రెసిడెంట్ కోర్ట్ ప్రెసిడెంట్ జస్టిస్ లిసెలెట్ హెంజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్విస్ న్యూస్ వెబ్‌సైట్ 20 మినిట్స్ ప్రకారం నిందితుడిని ఆగస్టు 11 న విడుదల చేయవచ్చని తెలిపింది.
Here's Swiss Protest Court Ruling Reducing Rapist's Sentence
Switzerland only defines rape as forced sex involving violence, threats or psychological pressure. This means that in certain situations, unless a woman specifically defends herself, her aggressor will be charged with "sexual harassment" rather than "rape"https://t.co/4ldwDEoiu1
— daktari Linnie🇸🇪 🇰🇪 (@ElenaNjeru) August 9, 2021
నిందితుడి శిక్ష కాలాన్ని తగ్గిస్తూ జస్టిస్ హెంజ్ మరింతగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధితురాలు కొన్ని తప్పుడు సంకేతాలు పంపింది. అత్యాచారం జరిగిన రోజున ఆమె మరో వ్యక్తితో కలిసి నైట్‌క్లబ్‌క్ వెళ్లి ఎంజాయ్ చేసింది.. ఇవన్ని నిందితుడిపై ప్రభావం చూపాయని జస్టిస్ హెంజ్ అన్నారు. ఈ కేసులో నిందితుడిది మధ్యస్థమైన నేరంగా పేర్కొన్నారు. పైగా అత్యాచారం కూడా 11 నిమిషాలపాటే సాగిందని.. ఈ ఘటనలో బాధితురాలికి ఎక్కువ గాయాలు కాలేదని.. అందుకే అతడికి శిక్షను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ తీర్పుకు వ్యతిరేకంగా బాసెల్ నగరవ్యాప్తంగా అక్కడి ప్రజలు నిరసన తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజనులు జస్టిస్ హెంజ్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. ‘‘11 నిమిషాల దారుణ చర్య కొన్ని జనరేషన్ల వరకు వెంటాడుతూనే ఉంటుంది.. ఈ దారుణ అనుభవం నుంచి బయటపడటానికి ఆమెకు ఓ జీవితకాలం పడుతుంది. అంటే 11 నిమిషాల వ్యవధి (Rape in 11 minutes) ఆమె జీవితకాలంతో సమానం. కోర్టుకు ఈ విషయం ఎందుకు అర్థం కాలేదు. నైట్‌క్లబ్‌కు వెళ్లడం అనేది ఆమె వ్యక్తిగత అంశం.. దాన్ని కూడా తప్పంటే... అసలు ఆడవారు ఈ భూమి మీద పుట్టడం కూడా నేరమే అవుతుంది కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.