'Politics of Hate': మత విద్వేష రాజకీయాలు వెంటనే ఆపండి, మైనారిటీలను నిత్యం భయాందోళనకు గురిచేస్తున్నారంటూ.. ప్రధాని మోదీకి లేఖ రాసిన 100 మందికి పైగా మాజీ బ్యూరోక్రాట్లు

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మత హింస కేసులపై 100 మందికి పైగా మాజీ బ్యూరోక్రాట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రధాని మోడీ మౌనం వీడాలని..దేశంలో విద్వేష రాజకీయాలకు (Hate against minorities) ముగింపు పలకాలని వారంతా ఆ లేఖలో కోరారు. దేశంలోని రాజకీయ పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ద్వేషపూరిత రాజకీయాలకు' స్వస్తి పలకాలని కోరారు.

'Politics of Hate': మత విద్వేష రాజకీయాలు వెంటనే ఆపండి, మైనారిటీలను నిత్యం భయాందోళనకు గురిచేస్తున్నారంటూ.. ప్రధాని మోదీకి లేఖ రాసిన 100 మందికి పైగా మాజీ బ్యూరోక్రాట్లు
PM Narendra Modi. (Photo Credits: ANI)

New Delhi, April 27: దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మత హింస కేసులపై 100 మందికి పైగా మాజీ బ్యూరోక్రాట్లు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ప్రధాని మోడీ మౌనం వీడాలని..దేశంలో విద్వేష రాజకీయాలకు (Hate against minorities) ముగింపు పలకాలని వారంతా ఆ లేఖలో కోరారు. దేశంలోని రాజకీయ పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ద్వేషపూరిత రాజకీయాలకు' స్వస్తి పలకాలని కోరారు. తాము అతి పెద్ద సామాజికి ముప్పును ఎదుర్కుటున్నాం అని, ఇది కేవలం రాజ్యంగ నైతికత, ప్రవర్తనకు సంబంధించినది మాత్రమే కాదని (Call for End to 'politics of Hate') ఆ లేఖలో స్పష్టం చేశారు.

సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే మీ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏడాది 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో, పక్షపాత ధోరణికి అతీతంగా వ్యవహరించాలని తాము ఆశిస్తున్నాం. మీ పార్టీ నియంత్రణలో ఉన్న ప్రభుత్వాలు చాలా పట్టుదలతో ద్వేషపూరిత రాజకీయాలకు ముగింపు పలకడానికి కృషి చేస్తున్నాయి. అంతేకాదు మన వ్యవస్థాపక పితామహులు సృష్టించిన రాజ్యాంగ విధానాన్ని నాశనం చేసేలా పరిస్థితి తలెత్తడంతోనే తమ ఆవేదనను, భావనను, వ్యక్తికరీంచేలా ఈ లేఖ రాసేందకు పురికొల్పిందన్నారు. బీజెపీ పాలిత రాష్ట్రాల్లోని ముస్లింలు మతపరమైన ద్వేషానికి ఎక్కువగా గురవుతున్నారని వారు (Over 100 Ex-bureaucrats) ఆరోపణలు కూడా చేశారు.

పెట్రోల్ ధరలు పెరుగుదలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమని మండిపాటు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించిన ప్రధాని

అస్సాం, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్ వంటి అనేక రాష్ట్రాల్లో గత కొన్ని సంవత్సరాలుగా..కొన్ని నెలలుగా మైనారిటీ వర్గాలపై, ముఖ్యంగా ముస్లింలపై ద్వేషపూరిత హింస పెరిగిందని లేఖలో పేర్కొన్నారు.అంతేకాదు అధికారంలో ఉన్న బీజేపీ శాంతి, సామరస్యాన్ని కాపాడే సాధనంగా కాకుండా, మైనారిటీలను నిత్యం భయాందోళనకు గురిచేసే సాధనంగా మారిందన్నారు." ఈ మేరకు మాజీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్, మాజీ హోం కార్యదర్శి జీకే పిళ్లై, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకేఏ నాయర్‌తో సహా 108 మంది ఆ లేఖపై సంతకాలు చేశారు.

(The above story first appeared on LatestLY on Apr 27, 2022 02:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).