India's COVID19 Report: భారత్‌లో కొత్తగా 44,658 కోవిడ్ కేసులు, 496 మరణాలు నమోదు మరియు 32,988 మంది రికవరీ; గడిచిన ఒక్కరోజులో కేరళ రాష్ట్రం నుంచే 30 వేలకు పైగా కొత్త కేసులు నిర్ధారణ
దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 79,48,439 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 61.22 కోట్లు దాటింది....
New Delhi, August 27: కేరళ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది, ఆ రాష్ట్రంలో వరుసగా రెండో రోజు 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో భారతదేశం యొక్క రోజూవారీ కోవిడ్ కేసుల్లో అకస్మాత్తుగా భారీ పెరుగుదల చోటుచేసుకుంటుంది. ఈ రోజు కూడా భారత్ 44 వేలకు పైబడి కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న మొత్తం కొత్త కేసులలో మూడింట రెండు వంతుల కేసులు కేరళ రాష్ట్రం నుంచి ఉండటం గమనార్హం.
గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 44,658 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 496 కోవిడ్ మరణాలు సంభవించాయి. ఇందులో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే 30,007 కేసులు, 162 మరణాలు ఉన్నాయంటే ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,26,03,188 కు చేరింది, అలాగే ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,36,861 కు పెరిగింది.
ఇక, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 32,988 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,18,21,428 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,44,899 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.60% కు చేరగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.06 శాతానికి పెరిగాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
India reports 44,658 new #COVID19 cases,32,988 recoveries and 496 deaths in the last 24 hrs, as per Health Ministry.
Total cases: 3,26,03,188
Total recoveries: 3,18,21,428
Active cases: 3,44,899
Death toll: 4,36,861
Total vaccinated: 61,22,08,542 (79,48,439) in last 24 hrs pic.twitter.com/3Ekda2cKBP
— ANI (@ANI) August 27, 2021
ఆగష్టు 26 నాటికి దేశవ్యాప్తంగా 51,49,54,309కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 18,24,931 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 79,48,439 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 61.22 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 61,22,08,542 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 47.28 కోట్లు ఉండగా, 13.93 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.
(The above story first appeared on LatestLY on Aug 27, 2021 09:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

