Karnataka Shocker: ప్రియుడితో అక్క రాసలీలలు, వద్దని వార్నింగ్ ఇచ్చాడని తమ్ముడిని నరికేసింది, ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టిన కామాంధురాలు
అక్క అడ్డదారి తొక్కడంతోపాటు అడ్డొచ్చిన తమ్ముడిని అడ్డంగా నరికేసింది. తన రాసలీలల గురించి భర్త పట్టించుకోకపోయినా తమ్ముడు నిలదీయడంతో ప్రియుడితో కలిసి ఖతం (Sister Gets Brother Killed) చేసింది ఆ కామాంధురాలు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు (Karnataka Shocker) సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
Bengaluru, May 18: అక్క అడ్డదారి తొక్కడంతోపాటు అడ్డొచ్చిన తమ్ముడిని అడ్డంగా నరికేసింది. తన రాసలీలల గురించి భర్త పట్టించుకోకపోయినా తమ్ముడు నిలదీయడంతో ప్రియుడితో కలిసి ఖతం (Sister Gets Brother Killed) చేసింది ఆ కామాంధురాలు. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనకు (Karnataka Shocker) సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. హుబ్బళి సిటీకి సమీపంలోని నూల్కి గ్రామానికి చెందిన శంభులింగకు 18 ఏళ్ల క్రితం బసవ్వతో వివాహం అయింది. పెళ్లి నాటి నుంచి ఆ ఇద్దరి దాంపత్యం ఎంతో అన్యోన్యంగా సాగింది.
అయితే గత కొద్ది నెలల క్రితం నుంచి బసవ్వ అడ్డదారులు తొక్కడం ప్రారంభించింది. భర్త ఉన్నా.. పరాయి పురుషుల మోజులో పడిపోయింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధం (Illicit Relationship ) పెట్టుకుని విచ్చలవిడిగా ప్రవర్తించడం ప్రారంభించింది. ఈ విషయం భర్తకు తెలిసినా.. పరువు పోతుందని సైలెంట్‌గా ఉండిపోయాడు.అయితే భర్త పట్టించుకోకపోయినా.. ఆ విషయం బసవ్వ సోదరుడికి తెలిసింది. మొదట పద్ధతి మార్చుకోవాలని చెప్పి చూశాడు. అయినా ఆమె అదే విధంగా ప్రవర్తించడంతో సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో తమ్ముడిపై కోపం పెంచుకున్న బసవ్వ అతడు ఉంటే తన అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తాడని భావించి ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.
భార్యకు చీర కట్టుకోవడం రాలేదని భర్త ఆత్మహత్య, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న ఔరంగాబాద్ పోలీసులు
బజారుకు వెళ్లి వస్తున్న తమ్ముడిని అడ్డగించి నడి రోడ్డుపైనే ఆమె, ప్రియుడితో కలిసి హత్య చేశారు. ఆ తర్వాత తన తమ్ముడిని ఎవరో హత్య చేశారని ఏడుపు అందుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనరంతరం బసవ్వ ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకుని వారు తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో ప్రియుడితో కలిసి తానే హత్య చేశానని పోలీసుల ముందు ఒప్పుకుంది.
(The above story first appeared on LatestLY on May 18, 2022 03:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

