Rs 2000 Note Exchange Last Date: రూ. 2 వేల నోటు మార్పిడికి మరో 5 రోజులే గడువు, ఇంకా మార్కెట్లో మరో 7 శాతం నోట్లు, మీ దగ్గర ఉంటే వెంటనే మార్చుకోండి

కేంద్ర బ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణం తీసుకున్న సంగతి విదితమే. రూ.2వేల నోట్లు ఉన్నవారు మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

Rs 2000 Note Exchange Last Date: రూ. 2 వేల నోటు మార్పిడికి మరో 5 రోజులే గడువు, ఇంకా మార్కెట్లో మరో 7 శాతం నోట్లు, మీ దగ్గర ఉంటే వెంటనే మార్చుకోండి
Rs 2000 Note (Photo-X)

New Delhi, Sep 25: కేంద్ర బ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణం తీసుకున్న సంగతి విదితమే. రూ.2వేల నోట్లు ఉన్నవారు మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరుతో రూ.2 వేల నోటు మార్పిడికి గడువు ముగిసిపోతుంది. ఇప్పటికీ మీవద్ద పెద్ద నోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోండని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

పెద్ద నోటు మార్చుకునేందుకు ఆర్బీఐ గడువును పెంచే సూచనలు కనిపించడంలేదని చెబుతున్నారు. మే 19న రూ.2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులలో మార్చుకోవాలని సూచించింది. ఇందుకు సెప్టెంబర్ 30 వ తేదీని గడువుగా నిర్ణయించింది. అప్పటి వరకు పెద్ద నోటు మార్కెట్లో చలామణిలో ఉంటుందని, ఆ తర్వాత చెల్లబోదని స్పష్టం చేసింది.

మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోండి, వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ

ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు మార్కెట్ లోని రూ.2 వేల నోట్లలో 97 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయి. పెద్ద నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటన చేసిన 20 రోజుల్లోనే 50 శాతం నోట్లు తిరిగొచ్చాయని చెప్పింది. మార్కెట్లో ఇప్పటికీ ఉన్న మరో 7 శాతం నోట్లు ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్లు ఉన్న వారు తమ దగ్గర్లోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడమో లేక చిన్న నోట్లతో మార్చుకోవడమో చేయాలని సూచించింది.

(The above story first appeared on LatestLY on Sep 25, 2023 01:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).