Rs 2,000 Notes To Be Withdrawn: మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోండి, వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ
కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది
New Delhi, May 19: కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. (RBI to withdraw Rs 2000 currency note) ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే, ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని స్పష్టంచేసింది.
రూ.2వేల నోట్లు ఉన్నవారు మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఒక విడతలో గరిష్ఠంగా రూ.20వేల వరకు మార్పిడికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. డిపాజిట్ విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు విధించలేదు. బ్యాంకు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందీ లేకుండా నోట్ల మార్పిడి ప్రక్రియ చేపట్టాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. దేశంలోని 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ.2వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం కల్పిస్తున్నట్టు తెలిపింది. అయితే, ఈనోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
2016 నవంబర్‌లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు నేపథ్యంలో నగదు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ.2వేల నోట్లను తీసుకొచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. కాగా 2018-19లోనే ఈ నోట్ల ప్రింటింగ్‌ను నిలిపివేసినట్లు తెలిపింది. 2017 మార్చి నాటికి చలామణీలో ఉన్న నగదు మొత్తంలో రూ.2వేల నోట్ల వాటా 89 శాతంగా ఉంది. వాటి జీవితకాలం 4-5 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. 2018 మార్చి 31 నాటికి రూ.6.73 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. 2023 మార్చి నాటికి ఆ విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. అంటే చలామణీలో ఉన్న మొత్తం నగదులో రూ.2వేల నోట్ల వాటా 10.8 శాతానికి చేరిందని ఆర్‌బీఐ తెలిపింది.
‘క్లీన్ నోట్ పాలసీలో భాగంగా తాజాగా రూ.2వేల నోట్లను చలామణీని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అయితే, రూ.2వేలు నోటు అనేది ప్రస్తుతం లావాదేవీలకు వినియోగించుకోవచ్చని (లీగల్ టెండర్) స్పష్టం చేసింది. 2013-14లోనూ ఇదే తరహాలో సర్క్యులేషన్‌లో ఉన్న నోట్లను వెనక్కి తీసుకున్నామని ఆర్‌బీఐ గుర్తుచేసింది. (అప్పట్లో 2005 కంటే ముందు జారీ చేసిన నోట్లను ఆర్‌బీఐ వెనక్కి తీసుకుంది)
రూ.2 వేల నోట్లను ప్రజలు బ్యాంకుల ద్వారా మార్పిడి చేసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. ఏదైనా బ్యాంక్ శాఖ నుంచి మే 23 నుంచి సెప్టెంబరు 30 లోగా రూ.2వేల నోట్లను మార్పిడి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఒక విడతలో రూ.20వేల వరకు మార్చుకోవచ్చని పేర్కొంది. అన్ని బ్యాంకులూ రూ.2వేల నోట్ల జారీని నిలిపివేయాలని, ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కాగా 2016లో నవంబరులో చలామణిలో ఉన్న రూ.1,000 రూ.500 నోట్ల రద్దు చేసిన తరువాత రూ.2వేల కరెన్సీ నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
RBI ప్రకటన సారాంశం ఇదే..
♦ మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు.
♦ ఏ విత్ డ్రా అయినా, ఎంత డబ్బు ఇవ్వాలన్నా అందులో రూ. 2 వేల నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులను ఆదేశించిన ఆర్బీఐ
♦ సెప్టెంబరు 30 లోగా ప్రజలు తమ దగ్గరున్న 2 వేల నోట్లను ఏ బ్యాంకులోనయినా డిపాజిట్ చేయొచ్చు
♦ ఒక వ్యక్తి ఒక విడతలో గరిష్టంగా పది రూ. 2 వేల నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు.
♦ ఈ నెల 23 నుంచి రూ.2 వేల నోట్లు మార్చుకునే అవకాశం ఉంది
♦ మార్చుకోడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30
♦ 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిచిపోయిన రూ.2 వేల నోటు ముద్రణ
(The above story first appeared on LatestLY on May 19, 2023 08:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

