Ujjain Mahakal Temple Fire: ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఘోర అగ్నిప్రమాదం, భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, 13 మందికి తీవ్ర గాయాలు

మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని మహాకాళి గర్భగుడిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూజారితో సహా 13 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో వేలాది మంది భక్తులు ఆలయంలో ఉన్నారు. వారంతా ఆలయంలో జరిగే హోలీ వేడుకలను తిలకించేందుకు వచ్చారు

Ujjain Mahakal Temple Fire: ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఘోర అగ్నిప్రమాదం, భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, 13 మందికి తీవ్ర గాయాలు
Fire Breaks out During Bhasma Aarti at Ujjain Mahakal Temple (Photo Credits: X/@ANI)

మధ్యప్రదేశ్‌ ఉజ్జయిని మహాకాళి గర్భగుడిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పూజారితో సహా 13 మందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో వేలాది మంది భక్తులు ఆలయంలో ఉన్నారు. వారంతా ఆలయంలో జరిగే హోలీ వేడుకలను తిలకించేందుకు వచ్చారు. హారతి సమర్పిస్తున్న పూజారి సంజీవ్‌ వెనుక నుంచి ఎవరో గులాల్ వెదజల్లడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెంటనే అక్కడున్న కొందరు భక్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించినట్లు ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు. ఘటనపై విచారణకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 25, 2024 11:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).