Madhya Pradesh: శాడిస్ట్ భర్త కిరాకతకం, భార్య ప్రైవేట్ భాగాల్లో కాలుస్తూ, నలుగురు స్నేహితులతో కలిసి దారుణంగా అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన ఇండోర్ పోలీసులు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తే మృగంలా మారి తన స్నేహితులతో కలిసి తన భార్యపై అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు. స్నేహితులతో కలిసి అత్యాచారానికి (Husband, friends gang-rape woman) పాల్పడడమే కాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.
Indore, Jan 17: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్తే మృగంలా మారి తన స్నేహితులతో కలిసి తన భార్యపై అత్యంత కిరాతకానికి ఒడిగట్టాడు. స్నేహితులతో కలిసి అత్యాచారానికి (Husband, friends gang-rape woman) పాల్పడడమే కాకుండా ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు.ఈ కేసులో బాధితురాలి భర్తతోపాటు మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త, అతడి స్నేహితులు అసహజరీతిలో తనపై అత్యాచారం చేసి సిగరెట్లతో రహస్య భాగాల్లో కాల్చి టార్చర్ (tortured with burning cigarette butts) చేశారని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. లైంగిక దాడిని ప్రతిఘటిస్తే చంపేస్తామని బెదిరించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇండోర్‌లోని షిప్రా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఫాం హౌస్‌లో 2019 నవంబర్, 2021 అక్టోబర్‌లలో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహిళ ఇండోర్‌కు చెందిన వ్యక్తిని మ్యాట్రీమోనీ సైట్ ద్వారా కలిసి వివాహం చేసుకుందని పోలీసులు వెల్లడించారు. అతడికి అప్పటికే వివాహం అయిందని తెలిపారు. అయితే, ఎలాగో ఆ ఫాం హౌస్ నుంచి తప్పించుకొని ఛత్తీస్‌గఢ్‌లోని తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నప్పటికీ.. నిందితుల్లో ఒకడు తనకు హాని కలిగించే ఉద్దేశంతో అనుసరిస్తుండేవాడని ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ఆమె భర్తతో పాటు మొత్తం ఐదుగురు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పలు ప్రాంతాల్లో వారందరినీ అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
(The above story first appeared on LatestLY on Jan 17, 2022 11:17 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

