Bengaluru, Jan 13: కర్ణాటకలోని హసన్ జిల్లాలోని మహారాజా పార్క్ వద్ద మహిళతో అనుచితంగా ప్రవర్తించాడనే (Harassing Woman In A Park) ఆరోపణతో అతడిని నడిరోడ్డు మీద నగ్నంగా ఊరేగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దాడికి గురైన వ్యక్తి రాష్ట్రంలోని విజయపుర జిల్లాకు (Vijayapura district) చెందిన మేఘరాజ్‌గా గుర్తించారు. అతను హసన్ నగరంలో భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్నారు. మేఘరాజ్ పార్క్‌లో సేదతీరుతుండగా, అక్కడ ఉన్న మహిళను వేధిస్తున్నట్లు స్థానికులు గమనించారు.
ఆ తర్వాత కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. పోలీసులకు అప్పగించడానికి బదులు, వారు అతనిని కొట్టి, బట్టలు విప్పి, ఆపై రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ అయిన హేమావతి విగ్రహం సర్కిల్ దగ్గర నగ్నంగా ( Karnataka Man Thrashed And Paraded Naked) ఊరేగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.వెంటనే మేఘరాజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఆరా తీసిన హసన్ నగర పోలీసులు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై దాడి చేసి నగ్నంగా ఊరేగించినందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
IPC సెక్షన్‌లు 341 (తప్పుడు నిర్బంధానికి శిక్ష), 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష) 504 (శాంతిని ఉల్లంఘించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపులకు శిక్ష) కింద నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు హసన్ పోలీసులు NDTVకి తెలిపారు.