Mumbai Shocker: ముంబైలో ఆగని అత్యాచారాలు, సుత్తితో కొట్టి యువతిని దారుణంగా రేప్ చేసిన కామాంధుడు, నిందితుడిని అరెస్ట్ చేసిన థానే పోలీసులు, మరో ఘటనలో మూత్ర విసర్జనకు వెళ్లిన చిన్నారిపై అత్యాచారం
stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Mumbai, Sep 13: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరం అత్యాచారాలకు అడ్డాగా మారుతోంది. మొన్న నిర్భయ లాంటి ఘటన మరచిపోకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై సుత్తితో దాడి చేసి, అత్యాచారం (Man rapes teenage girl) చేసిన ఘటన ముంబైలోని థానేలో చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి ఘటన జరిగిందని, ప్రస్తుతం నిందితుడు తమ అదుపులో ఉన్నాడని పోలీసులు ఆదివారం వెల్లడించారు.

షిర్డీకి చెందిన బాధిత బాలిక.. ప్రైవేటు బస్సులో కల్యాణ్‌లోహ్‌ మార్గ్‌ ప్రాంతానికి శుక్రవారం రాత్రి చేరుకుంది. అక్కడి నుంచి తన స్నేహితులను కలిసేందుకు ఉల్హాస్‌ నగర్‌ రైల్వేస్టేషన్‌కు లోకల్‌ రైలులో వెళ్లింది. అక్కడ తన ఇద్దరు మిత్రులను కలిసింది. వారితో కలిసి స్కైవేపై నడుచుకుంటూ వెళుతుండగా.. శ్రీకాంత్‌ గైక్వాడ్‌ (30) అనే వ్యక్తి ఉన్నట్టుండి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. బాలిక ముఖానికి కట్టుకున్న వస్త్రాన్ని బలవంతంగా లాగేశాడు. అనంతరం సుత్తితో (attacking her with hammer) తలపై కొట్టాడు. అడ్డుపడితే మీపైనా దాడి చేస్తానంటూ స్నేహితులను బెదిరించాడు.

దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం నిందితుడు బాలికను రైల్వేస్టేషన్‌కు సమీపంలోని ఓ పాత భవనంలోకి తీసుకుపోయి అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి బాధితురాలు తప్పించుకోవడానికి యత్నించగా మళ్లీ కొట్టాడు. శనివారం ఉదయం శ్రీకాంత్‌ లేని సమయంలో బాధితురాలు తప్పించుకుని ఇంటికి చేరుకుంది. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు కల్యాణ్‌ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి పోలీసులు శ్రీకాంత్‌ గైక్వాడ్‌ను అరెస్టు చేశారు. పోక్సో సహా వివిధ చట్టాల కింద కేసు నమోదు చేశారు. బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

అమ్మగారింటికి వెళ్తావా అంటూ భార్య ముక్కును కోసిన శాడిస్ట్ భర్త, రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన, పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలి సోదరుడు

ఇక తన స్నేహితులతో కలిసి మూత్ర విసర్జనకు వెళ్లిన చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా అంజన్‌గావ్‌సుర్జి మండలం వంజ గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారి.. తన స్నేహితులతో కలిసి మూత్ర విసర్జనకు వెళ్లింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన ఓ యువకుడు.. బలవంతంగా బాలికను తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక తన పొలంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

మరో ఘటనలో మహారాష్ట్రలోని అమరావతి జిల్లా దర్యపూర్‌లో ఒక వ్యక్తి మైనర్‌ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో శనివారం ఆత్మహత్య చేసుకుంది. 17 ఏండ్ల బాలికపై ఒక వ్యక్తి కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఏడు నెలల గర్భవతి కావడంతో ఈ విషయాన్ని తట్టుకోలేక శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. 15 రోజులు రిమాండ్‌ విధించడంతో నిందితుడ్ని జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ దిలిప్ పాటిల్‌ తెలిపారు.

అనాథని చేరదీస్తే..డబ్బు కోసం ప్రియుడితో కలిసి పెంపుడు తల్లిని చంపేసిన కసాయి కూతురు, హైదరాబాద్‌లో దారుణ ఘటన, నిందితులని అరెస్ట్ చేసిన పోలీసులు

ఇక ముంబై నగర శివారు సాకినాక ప్రాంతంలో ఖైరానీ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున టెంపో వాహనంలో 34 ఏళ్ల మహిళపై దుండగుడు కిరాతకానికి ఒడిగట్టాడు. అత్యాచారానికి పాల్పడి, ఆపై దారుణంగా హింసించాడు. కత్తితో పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున కన్నుమూసింది.