Maharashtra Shocker: మహారాష్ట్రలో దారుణం.. భర్తకు మత్తుమందు ఇచ్చి ఇంట్లోనే గొయ్యిలో పండబెట్టిన మహిళ.. భర్తకు మెళుకువ రావడంతో ఘోరం వెలుగులోకి..

బాలీవుడ్ క్రైమ్-థ్రిల్లర్ 'దృశ్యం' సినిమాను గుర్తుకు తెచ్చే తరహాలో మహారాష్ట్రలోని బారామతిలో ఘోర ఉదంతం వెలుగు చూసింది. తన భర్తను కిరాతకంగా చంపడానికి కుట్ర పన్నిన 38 ఏళ్ల షర్మిలా ప్రవీణ్ జగ్‌తాప్ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

Maharashtra Woman Drugs Husband, Beats Him With Bat, Tries to Bury Him

Maharashtra Shocker: బాలీవుడ్ క్రైమ్-థ్రిల్లర్ 'దృశ్యం' సినిమాను గుర్తుకు తెచ్చే తరహాలో మహారాష్ట్రలోని బారామతిలో ఘోర ఉదంతం వెలుగు చూసింది. తన భర్తను కిరాతకంగా చంపడానికి కుట్ర పన్నిన 38 ఏళ్ల షర్మిలా ప్రవీణ్ జగ్‌తాప్ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. భర్తకు మత్తుమందు ఇచ్చి, క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి, ఇంట్లోనే గుంత తవ్వి పాతిపెట్టేందుకు ప్రయత్నించిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఆగస్టు మొదట్లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల ప్రకారం.. జూలై 30న నిందితురాలు తన భర్త ప్రవీణ్ జగ్‌తాప్‌కు జ్యూస్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. దీంతో అతను తర్వాతి రెండు రోజులు పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆగస్టు 1న అతనికి కొద్దిగా స్పృహ వస్తున్న సమయంలో.. ఆ మహిళ అతనిపై క్రికెట్ బ్యాట్‌తో దారుణంగా దాడి చేసింది. ఆపై ముందే కూలీలతో ఇటుకలు, సిమెంటుతో కట్టించిన చతురస్రాకార నిర్మాణంలో అతడిని పడుకోబెట్టి, గట్టి చెక్క పలకతో మూసివేసి పాతిపెట్టడానికి ప్రయత్నించింది. అయితే, అక్కడ ఉన్న కూలీలకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ప్రవీణ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

వీడియో ఇదిగో..ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో లగేజ్ బెల్ట్‌పైకి ఎక్కిన మహిళ.. ఫ్లైట్ రద్దుతో సహనం కోల్పోయి ఇండిగో డెస్క్ వద్ద రచ్చ రచ్చ..

ఈ దాడిపై బాధితుడు ప్రవీణ్ మాట్లాడుతూ.. నాకు రెండు రోజులు నిద్రమాత్రలు ఇచ్చింది. మూడో రోజు బ్యాట్‌తో కొడుతుండటంతో నాకు కొద్దిగా మెలకువ వచ్చింది. కొట్టవద్దని వేడుకున్నా వినకుండా బాల్కనీలో తవ్విన గుంతలో పడేసింది. అయితే పనివాళ్లు నన్ను గమనించి పోలీసులకు ఫోన్ చేయడంతో నా ప్రాణాలు దక్కాయని తెలిపాడు. సంఘటన సమయంలో ఇంట్లోనే ఉన్న తన తల్లికి కూడా భార్య నిద్రమాత్రలు ఇచ్చిందని.. ఆమెకు స్పృహ వచ్చి వేరే కొడుకుకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు గోతిలో ఉన్న తనను ఆసుపత్రికి తరలించారని చెప్పాడు.

ఈ కుట్ర వెనుక చేతబడి లేదా క్షుద్రవిద్యల కోణం కూడా ఉండి ఉండవచ్చని బాధితుడు ఆరోపించాడు. అమావాస్య రోజులైన జూలై 13, 14 తేదీలలో తన భార్య క్యాలెండర్‌పై 'ఫలితం లేదు' అని రాసి ఉంచిందని గుర్తుచేశాడు. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా తన భార్యకు శక్తివంతమైన నిద్రమాత్రలు అమ్మిన మెడికల్ స్టోర్ యజమాని లైసెన్స్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. అలాగే, తన అత్తమామలు తీసుకెళ్లిన తన ఇద్దరు పిల్లల ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందేమోనని భయపడుతున్నానని, వారి సంరక్షణ హక్కును వెంటనే తనకు అప్పగించాలని పోలీసులను కోరాడు. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అరెస్టు చేశారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement