Human Sacrifice to Goddes: కొడుకు పుట్టాడని దేవతకు యువకుడ్ని బలి ఇచ్చిన వ్యక్తి, వరుసగా ముగ్గురు ఆడపిల్లలు, నాలుగో సంతానంగా కొడుకుపుట్టడంతో ఆనందంతో మొక్కు తీర్చుకున్నాడు, మధ్యప్రదేశ్‌లో ఘోరం
అబ్బాయి (male child)జన్మిస్తే.. ఓ యువకుడిని బలిస్తామని (human sacrifice) అమ్మవారిని ప్రార్థించారు. యాధృచ్చికంగా ఆ దంపతులకు కుమారుడు జన్మించడంతో.. మొక్కు నెరవేర్చుకునేందుకు ఓ యువకుడిని బలిచ్చారు.
Bhopal, July 16: ఓ ఇద్దరు దంపతులకు వరుసగా ముగ్గురు అమ్మాయిలు (three daughters) పుట్టారు. తమకు కుమారుడు కావాలన్న కలగానే మిగిలిపోయింది వారికి. తమకు ఎలాగైనా కుమారుడిని ప్రసాదించాలని దేవుళ్లను వేడుకున్నారు. ఒక వేళ నాలుగో కాన్పులో అబ్బాయి (male child)జన్మిస్తే.. ఓ యువకుడిని బలిస్తామని (human sacrifice) అమ్మవారిని ప్రార్థించారు. యాధృచ్చికంగా ఆ దంపతులకు కుమారుడు జన్మించడంతో.. మొక్కు నెరవేర్చుకునేందుకు ఓ యువకుడిని బలిచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రెవా (Rewa) జిల్లాలోని సర్‌మౌర్ పోలీసు స్టేషన్ పరిధిలో జులై 6న చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. రామ్‌లాల్ ప్రజాపతి (Ramlal prajapathi) తన భార్యతో కలిసి సర్‌మౌర్ పోలీసు స్టేషన్ పరిధిలో నివాసముంటున్నాడు. అయితే వారికి వరుసగా ముగ్గురు అమ్మాయిలు జన్మించారు. నాలుగో కాన్పులో అయినా మగబిడ్డ కావాలని అమ్మవారిని ప్రార్థించారు. అబ్బాయి జన్మిస్తే.. ఓ యువకుడిని బలిస్తామని మొక్కారు. అయితే ప్రజాపతి భార్య గత నెలలో మగ శిశువుకు జన్మనిచ్చింది. అమ్మవారిని ప్రార్థించినందుకే అబ్బాయి పుట్టాడని భావించిన ప్రజాపతి.. యువకుడి కోసం వేట ప్రారంభించాడు.
తన పొరుగు గ్రామానికి చెందిన ఓ 19 ఏండ్ల యువకుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి తన గ్రామంలోని అమ్మవారి ఆలయంలో యువకుడిని పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు. మరుసటి రోజు ఉదయం యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జులై 6వ తేదీన ప్రజాపతి వెంట ఆ యువకుడు తిరిగినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు చెప్పారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు.
(The above story first appeared on LatestLY on Jul 16, 2022 11:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

