Unmarried Youth Rising: పెళ్లిపై పెద్దగా ఆసక్తి చూపించని యువత, రోజురోజుకీ పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాదులు! ఏయే రాష్ట్రాల్లో ఎక్కువ మంది అవివాహితులున్నారో తెలుసా? అమ్మాయిలు, అబ్బాయిలదీ ఇదే వరుస
Marriage| Representational Image (Photo Credits: unsplash)

New Delhi, July 16:  దేశంలో పెండ్లికాని యువత (Unmarried youth) పెరిగిపోతున్నట్టు ఓ ప్రభుత్వ సర్వే వెల్లడించింది. జాతీయ యువజన విధానం-2014 ప్రకారం 15-29 ఏండ్ల మధ్య వారిని యువతగా పరిగణిస్తారు. వీరిలో పెండ్లి కానివారు 2011లో 17.2% మంది ఉండగా, 2019 నాటికి వీరి సంఖ్య 23 శాతానికి పెరిగింది. పెండ్లికాని ప్రసాదుల సంఖ్య భారీగా పెరుగుతున్నదని జాతీయ గణాంకాల కార్యాలయం నివేదిక పేర్కొంది. 2011 నాటికి పెండ్లికాని పురుషుల సంఖ్య (Unmarried youth)20.8% ఉండగా, 2019 నాటికి 26.1 శాతానికి పెరిగింది. యువతుల సంఖ్య కూడా 2011లో 13.5% నుంచి 2019 నాటికి 19.9 శాతానికి చేరింది.  జమ్ముకశ్మీర్‌ (Jammu kashmir), యూపీ(UP), ఢిల్లీ (Delhi), పంజాబ్‌ల్లో పెండ్లికాని యువత సంఖ్య ఎక్కువగా ఉండగా, కేరళ, తమిళనాడు, ఏపీ, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో తక్కువగా ఉన్నది.

బాల్యవివాహాలు 2019-21 నాటికి 1.7 శాతానికి తగ్గాయి. యువతులు విద్యావంతులు అవుతున్నకొద్దీ పెండ్లి చేసుకొనే వయస్సు కూడా పెరుగుతున్నదని సర్వే పేర్కొంది. 18 ఏండ్లు దాటకముందే వివాహమయ్యే యువతుల సంఖ్య 15 ఏండ్లలో సగానికి సగం తగ్గినట్టు తెలిపింది. కౌమార దశలోనే తల్లులయ్యే వారి సంఖ్య 16 నుంచి 7శాతానికి తగ్గినట్టు పేర్కొంది. సంతానోత్పత్తి క్షీణత, ఆయుర్దాయం పెరుగుదలతో 2036 నాటికి దేశంలో యువత జనాభా (youth population)తగ్గిపోతుందని, వృద్ధుల సంఖ్య పెరుగుతుందని తెలిపింది. యువతీయువకుల సంఖ్య 1991లో 22.27 కోట్లు కాగా, 2021 నాటికి 37.14 కోట్లకు పెరిగింది. అయితే 2036 నాటికి వీరి సంఖ్య 34.55 కోట్లు ఉండవచ్చని అంచనా వేసింది.

Odisha Shocker: భార్య శీలంపై అనుమానం, తలనరికి 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి, పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు, భార్యశవంతో రాత్రంతా ఏం చేశాడంటే?  

జాతీయ గణాంకాల సంస్థ (Ministry of statistics) తాజా అధ్యయనం ప్రకారం నేటి యువతలో పెళ్లి మాట ఎత్తనివారి సంఖ్య 2019 నాటికి 23 శాతం ఉంది. 2011లో వీరి శాతం 17 మాత్రమే. బాల్య వివాహాలు తగ్గడం ఈ అధ్యయనంలో కనిపించినా తరుణ వయసు వచ్చాక కూడా పెళ్లి మాట ఎత్తకపోవడం పట్టించుకోవలసిన విషయంగా అర్థమవుతోంది. అబ్బాయిల్లో 2011లో నూటికి 20 మంది పెళ్లి మాట ఎత్తకపోతే 2019లో 26 మంది పెళ్లి ప్రస్తావన తేవడం లేదు.

Rupee Dollar: వచ్చే వారం రూపాయి మరింత పతనం అయ్యే చాన్స్, డాలర్ కు ప్రతిగా రూపాయి రూ.80 దాటేసే చాన్స్, ఎందుకు ఇలా జరుగుతోంది.. 

అమ్మాయిల్లో 2011లో నూటికి 11 మంది పెళ్లి చేసుకోకపోతే 2019లో నూటికి 20 మంది పెళ్లి పట్ల నిరాసక్తిగా ఉన్నారు. సగటున చూస్తే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి నూటికి 23 మంది 29 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్ల్‌లోనో ఒక వీధిలోనో 100 మంది యువతీ యువకులు ఉంటే వారిలో 23 మంది అవివాహితులుగా కనిపిస్తూ ఉంటారు. ఆ ఇళ్ల తల్లిదండ్రులు, ఆ అవివాహితులు నిత్యం ‘పెళ్లెప్పుడు’ అనే మాటను ఎదుర్కొనాల్సిందే.

దేశం మొత్తం గమనిస్తే పెళ్లి కాని యువతీ యువకులు అత్యధికంగా ఉన్న ప్రాంతం జమ్ము అండ్‌ కశ్మీర్‌. దీని తర్వాత ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబు రాష్ట్రాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ దాదాపు 30 ఏళ్ల వరకూ పెళ్లిళ్లు జాప్యం అవుతున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఈ శాతం తక్కువగా ఉంది. అంటే కొంచెం ఆలస్యమైనా చేసుకుంటూ ఉన్నారు. అయితే మొత్తంగా దేశంలో చూసినప్పుడు 25 నుంచి 29 మధ్య చేసుకునేవారి సంఖ్య గతంలో బాగున్నా ఇప్పుడు బాగా తగ్గింది. అంటే అమ్మాయిలలో 50 శాతం మంది, అబ్బాయిల్లో 80 శాతం మంది 25 దాటి 29 సమీపిస్తున్నా పెళ్లి మాట ఎత్తడం లేదు.