Odisha, July 15: అనుమానం పెనుభూతమైతే ఏమవుతుందో సజీవ సాక్ష్యం ఒడిషాలో (Odisha) జరిగింది. భార్య శీలం మీద అనుమానంతో ఉన్న భర్త ప్రతిరోజూ గొడవపడేవాడు. వేరేవాళ్లతో అక్రమ సంబంధం ఉందని ప్రతి రోజు వేధించేవాడు. అయితే ఫుల్లుగా మద్యం తాగిన అతను ఓ రోజు కిరాతకానికి పాల్పడ్డాడు. భార్య తలను (beheads wife) వేరు చేసి...దాన్ని పట్టుకొని 12 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. దెన్‌కనల్ (Denkanal)జిల్లా చంద్రశేఖర్‌పూర్ కు చెందిన నకపోడి మాఝీ అలియాస్ జందా(Janda) కు భార్య చంచలపై (Chanchala) అనుమానం పెరిగింది. భార్య పరాయి పురుషునితో సంబంధంలో ఉందనే అనుమానం అతడిని వేధించసాగింది. ఈ విషయమై కొద్ది రోజులుగా భార్యాభర్తలు గొడవపడుతున్నారు. రోజూలాగే గురువారం రాత్రి కూడా భార్యతో గొడవపడిన జందా ఆవేశంతో పదునైన ఆయుధంతో భార్య చంచల తల నరికాడు.
అయితే భార్యను చంపిన అతను రాత్రంతా ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. తెల్లారి ఆమె తలను తీసుకొని రోడ్డుపై 12 కిలో మీటర్లు నడుచుకుంటూ గొందియా (Gondhiya)పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన ఆయుధాన్నిస్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తన భార్య తలతో నడుచుకుంటూ వెళుతున్న జందాను కొందరు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య తలతో రోడ్డుపై నడుకుంటూ వెళ్లిన కిరాతక ఘటన ఇప్పుడు ఒడిషాతో పాటూ దేశవ్యాప్తంగా నెట్ లో హల్ చల్ చేస్తోంది.