Lucknow, July 15: గురుగ్రామ్‌లోని కసన్ గ్రామంలో కవీందర్ అనే క్యాబ్ డ్రైవర్ తన భార్య పొరుగువారితో పారిపోయిన మూడు రోజుల తర్వాత ఆత్మహత్య (Cab driver commits suicide) చేసుకున్నట్లు స్థానిక మీడియా నివేదించింది. కవీందర్ తన జీవితాన్ని ముగించే ముందు తన భార్య మరియు ఆమె ప్రేమికుడిపై IMT మనేసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.కసన్ గ్రామంలో నివాసం ఉంటున్న కవిందర్ ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేయడంతోపాటు క్యాబ్ నడుపుతున్నాడు. ఈ నెల 10న అతడి భార్య రీనా పొరుగింటి వ్యక్తి రామ్‌వీర్‌తో కలిసి (wife elopes with neighbour) వెళ్లిపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కవిందర్, తీవ్ర మనస్థాపం చెందాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అపస్మారక స్థితిలో ఉన్న కవిందర్‌ను గమనించిన సోదరుడు సంతోష్ కుమార్, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే కవిందర్ అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కవిందర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం అతడి బంధువులకు అప్పగించారు. సోదరుడు సంతోష్ కుమార్ ఫిర్యాదు నేపథ్యంలో మృతుడి భార్య రీనాపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఆమెతోపాటు పొరుగింటి వ్యక్తి రామ్‌వీర్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. వారిద్దరిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.