Mumbai Airport Bomb Threat: ముంబయి విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరింపు మెయిల్, ఒక మిలియన్ డాలర్లు చెల్లించాలని అగంతకులు డిమాండ్
మహారాష్ట్రలోని ముంబయి విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. వచ్చే 48 గంటల్లో ఒక మిలియన్ డాలర్లు బిట్‌కాయిన్ల రూపంలో చెల్లించకపోతే విమానాశ్రయంలోని టర్మినల్-2 పేల్చేస్తామని ఆగంతుకులు బెదిరించారు
మహారాష్ట్రలోని ముంబయి విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్ వచ్చిందని అధికారులు తెలిపారు. వచ్చే 48 గంటల్లో ఒక మిలియన్ డాలర్లు బిట్‌కాయిన్ల రూపంలో చెల్లించకపోతే విమానాశ్రయంలోని టర్మినల్-2 పేల్చేస్తామని ఆగంతుకులు బెదిరించారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టు ఫీడ్‌బ్యాక్‌కు గురువారం మెయిల్ పంపించారు. 24 గంటల తరువాత మరో మెయిల్ పంపిస్తామని కూడా నిందితులు తెలిపారు. దీంతో, విమానాశ్రయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీకి కూడా ఇటీవల బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. రూ.20 కోట్లు ఇవ్వకపోతే అంబానీని హత్యచేస్తానంటూ ఓ వ్యక్తి మెయిల్ పంపించాడు. ఆ తరువాత రూ.200 కోట్లు , రూ.400 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తెలంగాణకు చెందిన ఓ 19 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.
Here's News
Flash:#Mumbai Police registered case after an unidentified person sent an email threatening to blow up Terminal 2 of #MumbaiAirport if one million dollars, in Bitcoin, were not paid to him within next 48 hours.
The threatening email was sent from an id--quaidacasrol@gmail.com… pic.twitter.com/9N545smnGA
— Yuvraj Singh Mann (@yuvnique) November 24, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Nov 24, 2023 11:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

