Mumbai Shocker: కన్నతండ్రే పశువులా మీదపడి, 16 ఏళ్ల కూతురిపై రెండేళ్ల నుంచి కామవాంఛ తీర్చుకున్నాడు, సోదరుడు మృగంలా మారి ఆమెపై అత్యాచారం చేశాడు, ముంబైలో దారుణ ఘటన
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదవ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై రెండు సంవత్సరాల నుంచి వావివరసలు మరచి కన్న తండ్రి, సోదరుడు పలుమార్లు లైంగిక దాడులకు (Father, Brother of Minor Girl Arrested for Allegedly Raping) పాల్పడ్డారు. స్కూలు టీచర్, ప్రిన్సిపల్ కు బాలిక తన గోడును వెళ్లబోసుకోవడంతో ఈ దారుణం బయటపడింది.
Mumbai, Jan 21: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదవ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై రెండు సంవత్సరాల నుంచి వావివరసలు మరచి కన్న తండ్రి, సోదరుడు పలుమార్లు లైంగిక దాడులకు (Father, Brother of Minor Girl Arrested for Allegedly Raping) పాల్పడ్డారు. స్కూలు టీచర్, ప్రిన్సిపల్ కు బాలిక తన గోడును వెళ్లబోసుకోవడంతో ఈ దారుణం బయటపడింది. స్కూలు అధికారులు వెంటనే ఓ ఎన్జీవోను సంప్రదించగా వారు బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..2019 జనవరిలో బాలిక నిద్రిస్తుండగా తండ్రి ఆమెపై పశువులా మీద పడి కామవాంఛను (Raping Her Repeatedly in Dharavi) తీర్చుకున్నాడు. ఆపై అదే నెలలో సోదరుడు కూడా ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. తన చెల్లెలుపై కూడా ఈ కామాంధులు లైంగిక దాడికి పాల్పడతారనే భయంతో బాధితురాలు ఈ విషయం బయటపెట్టిందని పోలీసులు తెలిపారు. బాలిక ఫిర్యాదుతో పోక్సో సహా పలు సెక్షన్ల కొంద కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రీ కొడుకులను అరెస్ట్ చేశారు.
పుణేలో జరిగిన మరో దారుణ ఘటనలో వదిన స్నానం చేస్తుండగా వీడియో తీసి ఆ క్లిప్ ను చూపుతూ బ్లాక్ మెయిల్ చేసి లైంగిక దాడులకు పాల్పడిన మరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో క్లిప్ ను వైరల్ చేస్తానని మరోసారి నిందితుడు లైంగికదాడికి ప్రయత్నించడంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
(The above story first appeared on LatestLY on Jan 21, 2022 05:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

