Mumbai Shocker: యూట్యూబ్‌లో అశ్లీల ప్రాంక్‌ వీడియోలు, కోట్ల రూపాయిలను ఆర్జించిన యూట్యూబర్లు, పోర్న్‌కు సంబంధించిన 17 యూట్యూబ్‌ ఛానళ్లు రన్, పోలీసుల అదుపులో నిందితులు

దీనిపై కొందరు బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్‌ చేశారు.

Trans Woman Jailed After Using Public Wi-Fi to Watch and download 80000 porn Images From Hospital Bed (photo-PTI)

Mumbai, Feb 28: డబ్బు కోసం ముగ్గురు యువకులు అడ్డదారి తొక్కారు, సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశలో ముగ్గురు యువకులు (Mumbai Shocker) అశ్లీల ప్రాంక్‌ వీడియోలు చిత్రీకరిస్తూ కోట్ల రూపాయిలను ఆర్జించారు. దీనిపై కొందరు బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ముకేష్‌ గుప్త(29), జితేంద్ర గుప్త(25), కుమార్‌ సవ్‌(23) యూట్యూబ్‌ ఛానళ్లకు కంటెంట్‌ అందించేవారు. దీంతోపాటు సొంతంగా 17యూట్యూబ్‌ ఛానళ్లను నడిపేవారు. ఇవన్నీ కూడా పోర్న్‌కు సంబంధించినవే.

ఈ ఛానళ్లకు 20 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కాగా, ఒక మహిళతోపాటు, ముగ్గురు మైనర్‌ బాలికలు ప్రాంక్‌ వీడియో చేస్తే (obscene prank videos) కావల్సినంత డబ్బులిస్తామని ఆఫర్‌ చేశారు. అంతటితో ఆగకుండా వారితో అసభ్యంగా ప్రవర్తించి, వారి ప్రైవేట్‌పార్ట్స్‌ను తాకాలని చూశారు. ఈ ఘటనతో భయపడిపోయిన బాధితురాళ్లు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

వారి వద్ద నుంచి 5 ల్యాప్‌టాప్‌లు, 4 మొబైల్‌ ఫోన్లు, ఒక కెమెరా స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోక్సో, అశ్లీల నిరోధక చట్టం సహా పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, నిందితులు లాక్ డౌన్‌ సమయంలో 300ల వరకు అశ్లీల వీడియోలు వారి యూట్యూబ్‌ ఛానళ్లలో అప్‌లోడ్‌ చేసి రూ.2కోట్ల వరకు ఆర్జించారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు ముఖేష్‌ విద్యార్థులకు చదువు చెప్పేవాడని, అతని దగ్గరకు వచ్చే విద్యార్థులకు ఈ వీడియోలతో ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.