Bishnoi Community Stages Protest: మోదీ చీతాల కోసం మా జింకలే దొరికాయా? నమీబియా నుంచి వచ్చిన చీతాల ఆహారంపై బిష్ణోయ్ తెగ ఆందోళన, క్లారిటీ ఇచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఆ వర్గం ప్రజలు పూర్వ కాలం నుంచి తమ ఆరాధ్య దైవానికి ప్రతినిధిగా భావిస్తారు. అందువల్ల వీటిని చీతాలు వేటాడేందుకు అనువుగా, రాజస్థాన్ (Rajasthan) నుంచి తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు.

Bishnoi Community Stages Protest: మోదీ చీతాల కోసం మా జింకలే దొరికాయా? నమీబియా నుంచి వచ్చిన చీతాల ఆహారంపై బిష్ణోయ్ తెగ ఆందోళన, క్లారిటీ ఇచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
cheetath

Bhopal, SEP 21: ఇటీవలే నమీబియా నుంచి ఎనిమిది చీతాల్ని (cheetahs) ఇండియా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటికి ఆహారంగా రాజస్థాన్ (Rajasthan) నుంచి ఒక రకమైన జింకలు (chital) తీసుకొచ్చి, అక్కడ వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జింకల ఒంటిపై చిన్న మచ్చలు ఉంటాయి. అయితే, రాజస్థాన్ నుంచి జింకల్ని తీసుకురావడంపై అక్కడి బిష్ణోయ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి కారణం.. జింకల్ని (Deer) బిష్ణోయ్ వర్గం (Bishnoi community) దైవంతో సమానంగా భావించడమే. వీటిని ఆ వర్గం ప్రజలు పూర్వ కాలం నుంచి తమ ఆరాధ్య దైవానికి ప్రతినిధిగా భావిస్తారు. అందువల్ల వీటిని చీతాలు వేటాడేందుకు అనువుగా, రాజస్థాన్ (Rajasthan) నుంచి తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు నగరాల్లో ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ నిర్ణయం సరికాదని విమర్శించారు.

PM Narendra Modi: అంతరించిపోయిన చిరుతలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ, ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి చిరుతలు భారత్ కు బదిలీ.. 

అయితే, ఈ అంశంపై మధ్య ప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. రాజస్థాన్ నుంచి చీతాల్ని తీసుకొచ్చారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రకటించింది. ఇప్పటికే చీతాలను విడుదల చేసిన కునో నేషనల్ పార్కులో (Kuno National Park) 20,000కుపైగా జింకలు ఉన్నాయని, అలాంటప్పుడు కొత్తగా రాజస్థాన్ నుంచి వాటిని తీసుకురావాల్సిన అవసరం ఏముందని మధ్యప్రదేశ్ అటవీ శాఖ స్పష్టం చేసింది.

(The above story first appeared on LatestLY on Sep 21, 2022 09:32 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).